త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krithi Shetty | బంప‌రాఫ‌ర్ కొట్టేసిన ఉప్పెన హీరోయిన్ – మెగాస్టార్ సినిమాలో ఛాన్స్‌

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత డైరెక్ట‌ర్ బాబీతో ఓ యాక్ష‌న్ మూవీ చేయ‌బోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో చిరంజీవి కూతురిగా కృతిశెట్టి ( Krithi Shetty) క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jan 20, 2026, 6.41 pm IST

Krithi Shetty | బంప‌రాఫ‌ర్ కొట్టేసిన ఉప్పెన హీరోయిన్ – మెగాస్టార్ సినిమాలో ఛాన్స్‌
Advertisement

Krithi Shetty |  మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ మూడు వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. ఈ స‌క్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న చిరంజీవి త్వ‌ర‌లోనే త‌న నెక్స్ట్ మూవీని మొద‌లుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌...

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు త‌ర్వాత డైరెక్ట‌ర్ బాబీతో ఓ యాక్ష‌న్ మూవీ చేయ‌నున్నారు చిరంజీవి. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో క‌న్న‌డ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మించ‌బోతుంది. చిరంజీవి మూవీతోనే కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
చిరంజీవి, బాబీ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌ను ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. మార్చి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు తెలిసింది. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి యాక్ష‌న్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

కృతిశెట్టికి ఛాన్స్‌...

ఇందులో చిరంజీవి కూతురి పాత్ర కోసం కృతిశెట్టిని మేక‌ర్స్ ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం. అన‌స్వ‌ర రాజ‌న్‌, మ‌మితా బైజుతో పాటు మ‌రికొంద‌రు యంగ్ హీరోయిన్ల పేర్ల‌ను ప‌రిశీలించిన మేక‌ర్స్ చివ‌ర‌కు కృతిశెట్టిని సెటెక్ట్ చేశార‌ట‌. ఉప్పెన త‌ర్వాత తెలుగులో చాలానే సినిమాలు చేసినా హిట్టు మాత్రం అందుకోలేక‌పోయింది కృతిశెట్టి. మెగా 158 రూపంలో బంప‌రాఫ‌ర్ అందుకున్న‌ట్లు చెబుతున్నారు.
ఇందులో చిరంజీవికి జోడీగా ప్రియ‌మ‌ణి క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. మెగా 158 మూవీలో త‌న ఏజ్‌కు త‌గ్గ పాత్ర‌లోనే చిరంజీవి క‌నిపించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించ‌నున్న‌ట్లు స‌మాచారం.ఇటీవ‌లే త‌మిళ మూవీ వా వాథియార్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది కృతిశెట్టి. కార్తీ హీరోగా న‌టించిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. థియేట‌ర్ల‌లో రెండు రోజులు కూడా నిల‌బ‌డ‌లేక‌పోయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement