త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA World Cup 2026 | జపాన్‌ మ్యాజిక్‌.. 4-0 తేడాతో ట్యునీషియా చిత్తు

FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్‌ కప్‌ చరిత్రలో 1000వ మ్యాచ్‌ ట్యునీషియా-జపాన్‌ మధ్య జరింది. ఈ ప్రతిష్టాత్మక పోరులో ఆసియా అద్భుత ప్రదర్శనతో ట్యునీషియాను 4-0 తేడాతో చిత్తు చేసింది. శనివారం మెక్సికో స్టాడియో మాంటెర్రే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన జపాన్ నాకౌట్ దశకు చేరువైంది. మరోవైపు గ్రూప్-ఎఫ్‌లో వరుసగా రెండో ఓటమి చవిచూసిన ట్యునీషియా టోర్నీ నుంచి ఇంటిబాటపట్టిన మూడో జట్టుగా నిలిచింది.

P

Sports | Published On Jun 21, 2026, 1.02 pm IST

FIFA World Cup 2026 | జపాన్‌ మ్యాజిక్‌.. 4-0 తేడాతో ట్యునీషియా చిత్తు
Advertisement

- నాకౌట్‌కు మరింత చేరువగా..
- అయాసే ఉడా డబుల్‌ గోల్‌
- ప్రపంచకప్‌ నుంచి నిష్క్రిమించిన మూడో జట్టుగా ట్యునీషియా
- వరల్డ్‌ కప్‌ మ్యా‌చ్‌లో నాలుగు గోల్స్‌ వేసిన తొలి ఆసియా జట్టుగా ఘనత
- వరల్డ్‌ కప్‌ హిస్టరీలో మ్యాచ్‌కు ప్రత్యేక స్థానం

FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్‌ కప్‌ చరిత్రలో 1000వ మ్యాచ్‌ ట్యునీషియా-జపాన్‌ మధ్య జరింది. ఈ ప్రతిష్టాత్మక పోరులో ఆసియా అద్భుత ప్రదర్శనతో ట్యునీషియాను 4-0 తేడాతో చిత్తు చేసింది. శనివారం మెక్సికో స్టాడియో మాంటెర్రే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన జపాన్ నాకౌట్ దశకు చేరువైంది. మరోవైపు గ్రూప్-ఎఫ్‌లో వరుసగా రెండో ఓటమి చవిచూసిన ట్యునీషియా టోర్నీ నుంచి ఇంటిబాటపట్టిన మూడో జట్టుగా నిలిచింది. 1930 జూలై 13న ప్రారంభమైన తొలి ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌కు 96 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో జరిగిన ఈ చారిత్రక మ్యాచ్‌కు ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రత్యేక మ్యాచ్‌ను జపాన్ తమ అద్భుత ఆటతీరుతో మరింత చిరస్మరణీయంగా మార్చింది. మ్యాచ్ ప్రారంభమైన నాలుగో నిమిషానికే జపాన్ ఖాతా తెరిచింది. కైటో నకమురా అందించిన లో క్రాస్‌ను డైచి కమాడా గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ తొలి గోల్‌తోనే ట్యునీషియా ఒత్తిడిలో పడగా.. జపాన్ ఆటపై పూర్తిగా పట్టు సాధించింది. ఆ తర్వాత కూడా వరుస అటాకింగ్‌తో ప్రత్యర్థి డిఫెన్స్‌కు పరీక్ష పెట్టింది.

30వ నిమిషంలో రెండో గోల్‌..

30వ నిమిషంలో రెండో గోల్‌ వేసింది. బాక్స్ వెలుపల బంతిని అందుకున్న అయాసే ఉడ పవర్‌ఫుల్‌ షాట్‌తో బంతిని నెట్‌లోకి పంపి స్కోర్‌ను 2-0 తేడాతో పంపాడు. అప్పటికే జపాన్ మిడ్‌ఫీల్డ్‌పై పూర్తి నియంత్రణ సాధించగా.. ట్యునీషియా ఆటగాళ్లు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రేక్‌ తర్వాత జపాన్‌ మరింత పరిపక్వతతో ఆటను కొనసాగించింది. 69వ నిమిషంలో అయాసే ఇచ్చిన అద్భుత పాస్‌ను జున్యా ఇటో గోల్‌గా మలచడంతో ఆధిక్యం 3-0కి చేరింది. దాంతో ట్యునీషియా ఆశలు ఆవిరయ్యాడు. అనంతరం అయాసే మరోసారి డీప్‌ క్రాస్‌ను అద్భుతంగా హెడ్డర్‌ను గోల్‌గా మలిచాడు. దాంతో స్కోర్‌ 4-0కి చేరింది. ఈ గోల్‌తో ఒకే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో నాలుగు గోల్స్‌ వేసిన తొలి ఆసియా జట్టుగా జపాన్‌ చరిత్ర సృష్టించింది.

నాకౌట్‌కు చేరువగా..

ఈ విజయంతో గ్రూప్‌-ఎఫ్‌లో జపాన్‌ నాలుగు పాయింట్లతో నెదర్లాండ్స్‌తో సమానంగా నిలిచి నాకౌట్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. మరోవైపు స్వీడన్ చేతిలో 5-1 తేడాతో ఓడిన తర్వాత కొత్త కోచ్ హెర్వే రెనార్డ్ బాధ్యతలు చేపట్టిన ట్యునీషియా.. హైతీ, టర్కీ తర్వాత టోర్నీ నుంచి ఎగ్జిట్‌ అయిన మూడో జట్టుగా నిలిచింది. వరల్డ్‌ కప్‌ చరిత్రలో 1000వ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో గెలిచి.. హిస్టరీలో తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నది. ఈ నెల 26న స్వీడన్‌తో జపన్‌ తలపడనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా నాకౌట్‌కు చేరుతుంది. మరోవైపు ట్యునీషియా నామమాత్రపు, చివరి గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుంది.

Advertisement
Advertisement