Eagle Team | హైడ్రా ఈగల్ టీమ్‌గా కొత్త గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్లు.. ఉద్యోగంతో పెరిగిన ఆత్మవిశ్వాసం
Eagle Team | హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA)లో లభించిన ఉద్యోగాలు ట్రాన్స్‌జెండర్ సమాజానికి కొత్త దారిని చూపిస్తున్నాయి. ఉపాధితో పాటు గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని అందించిన ఈ అవకాశంతో వారు ఇప్పుడు “హైడ్రా ఈగల్ టీమ్”గా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
Eagle Team | హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA)లో లభించిన ఉద్యోగాలు ట్రాన్స్‌జెండర్ సమాజానికి కొత్త దారిని చూపిస్తున్నాయి. ఉపాధితో పాటు గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని అందించిన ఈ అవకాశంతో వారు ఇప్పుడు “హైడ్రా ఈగల్ టీమ్”గా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్‌జెండర్లకు హైడ్రా ఉద్యోగావకాశం కల్పించగా, అందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్, 5 మంది ట్రాన్స్‌మెన్ ఉన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవడంలో వారు చురుకుగా పాల్గొంటున్నారు. పార్కులు, ప్రజావసర భూములను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కబ్జాదారులు ఎంతటి వారైనా వెరవకుండా విధులు నిర్వహిస్తూ ప్రజా ఆస్తుల పరిరక్షణలో భాగస్వామ్యమవుతున్నామని వారు చెబుతున్నారు. హైడ్రా యూనిఫాం ధరించడం తమకు గౌరవంగా అనిపిస్తోందని అంటున్నారు. “హైడ్రా ఈగల్ టీమ్”గా గుర్తింపు పొందడం తమ జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణలోనూ, మాదాపూర్‌లో ఈదులకుంట పరిరక్షణలోనూ వారు కీలకంగా పనిచేశారు. ప్రజలను చైతన్యం చేయడం, మహిళలతో మాట్లాడి పరిస్థితులను సమన్వయం చేయడం, అధికారులు–ప్రజల మధ్య సేతగా వ్యవహరించడం వంటి పనుల్లో ప్రత్యేకత చూపిస్తున్నారు.
సహనం, భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం వల్ల ఫీల్డ్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం నెల జీతంతో వారు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. సమాజంలో గౌరవం పెరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి మాట్లాడుతూ— “డబ్బుకంటే గౌరవమే ముఖ్యమైంది. ఇప్పుడు యూనిఫాం వేసుకుని బయటికి వెళ్లడం గర్వంగా ఉంది. అవకాశం ఇస్తే ట్రాన్స్‌జెండర్లు ఏ రంగంలోనైనా రాణిస్తారని మా పని నిరూపిస్తోంది” అన్నారు. రుచిత మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని తెలిపారు. తాన్షీరాయ్ మాట్లాడుతూ గతంలో ఎదురైన అవమానాల నుంచి బయటపడి ఇప్పుడు గౌరవంగా పని చేస్తున్నామని చెప్పారు. హైడ్రా అధికారులు మాత్రం ఈ ఈగల్ టీమ్ పనితీరు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోందని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
జులై 26, 2026
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ



