త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 2000 మంది సిబ్బందితో కూల్చివేత‌లు

HYDRAA | సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో హైడ్రా (HYDRAA) భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. అక్రమ కట్టడాలను పెద్దఎత్తున కూల్చివేస్తున్న‌ది. మున్సిప‌ల్ అధికారులు, రెవెన్యూ అధికారుల‌తో క‌లిసి భారీ బందోబ‌స్తు న‌డుమ అక్ర‌మ‌క‌ట్ట‌డాల‌ను కూల్చివేస్తున్నారు.

G

Telangana | Published On Apr 11, 2026, 11.31 am IST

HYDRAA | అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 2000 మంది సిబ్బందితో కూల్చివేత‌లు
Advertisement

HYDRAA | త్రినేత్ర‌.న్యూస్‌: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో హైడ్రా (HYDRAA) భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. అక్రమ కట్టడాలను పెద్దఎత్తున కూల్చివేస్తున్న‌ది. మున్సిప‌ల్ అధికారులు, రెవెన్యూ అధికారుల‌తో క‌లిసి భారీ బందోబ‌స్తు న‌డుమ అక్ర‌మ‌క‌ట్ట‌డాల‌ను కూల్చివేస్తున్నారు. నిజాం కాలం నాటి 1,260 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు గుర్తించడంతో చర్యలకు ఉపక్రమించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన ముఖీమ్‌ గెస్ట్‌హౌస్​ను కూల్చివేసింది. ముఖీమ్‌ సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది.

ఐలాపురంలో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న‌ది. ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అయినా కూడా సుమారు 400 ఎకరాల్లో అక్రమంగా శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన 860 ఎకరాలను కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్దారించిన హైడ్రా.. శనివారం ఉదయం భారీ వాహ‌నాలు, సుమారు 2000 మంది సిబ్బందితో అక్క‌డికి చేరుకున్న‌ది. కబ్జాకు గురైన ప్రభుత్వ, ఇనాం భూములను స్వాధీనం చేసుకుంటున్న‌ది.

కూల్చివేత‌ల‌ను అడ్డుకునేందుకు స్థానికులు, అపార్ట్‌మెంట్ కొనుగోలుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళ‌న‌కు దిగారు. దీంతో హైడ్రా సిబ్బందికి, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి నీకు సిగ్గులేదా.. ఇండ్లు కట్టిస్తానని చెప్పి గెలిచి, ఇప్పుడు ఇండ్లు కూలుస్తావా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదన్న మాట్లాడేది ఉంటే పగటి పూట వచ్చి మాట్లాడాలి, అర్ధరాత్రి 12 గంటలకు రావడం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నీ ఆస్తులు చూసే నీ బిడ్డకు పెళ్లి సంబంధం కుదిరింది కదా, మరి మా ఆస్తులు నాశనం చేస్తే మా బిడ్డలకు పెళ్లి ఎట్ల చేయాలని నిల‌దీస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తే చెప్పుతో కొడతామంటూ ఓ మ‌హిళ త‌న ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కింది.

కేసీఆర్‌ను ఓడించి, రేవంత్ రెడ్డిని గెలిపించి తప్పు చేశామ‌ని మ‌రో బాధితురాలు మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు ఆ కర్మ అనుభవిస్తున్నామ‌న్నారు. ఇండ్లు కట్టి ఇవ్వడం కాదు.. ఉన్న మా ఇండ్లు కూల్చుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు మణికొండ ప‌రిధిలోని అల్కపూరి కాలనీలో ఫుట్ పాత్‌లపై నిర్మాణాల‌ను అధికారులు తొల‌గిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement