HYDRAA | కొత్వాల్‌గూడలో మంత్రి పొంగులేటి క్రషర్ మిషన్లను కూల్చివేసిన హైడ్రా.. వీడియో
HYDRAA | శంషాబాద్ కొత్వాల్‌గూడలో క్రషర్ మిషన్లను హైడ్రా (HYDRAA) కూల్చివేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas Reddy) చెందిన క్రషర్స్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు.
HYDRAA | త్రినేత్ర.న్యూస్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో క్రషర్ మిషన్లను హైడ్రా (HYDRAA) కూల్చివేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas Reddy) చెందిన క్రషర్స్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు రాఘవా కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై చేసిన ఆరోపణలతో ప్రభుత్వం డైలమాలో పడిన విషయం తెలిసిందే. తప్పు జరిగిందని గ్రహించిన కాంగ్రెస్ సర్కారు వాటిని కూల్చేయాలని నిర్ణయించింది. ఇందులోభంగా మంత్రి పొంగులేటిని ఒప్పించిన ప్రభుత్వం.. తాజాగా కూల్చివేతలు చేపట్టింది. దీంతో సీఎం తీరుపై పొంగులేటి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ క్రషర్ మిషన్స్‌ను కూల్చేసిన హైడ్రా అధికారులు
కొత్వాల్ గూడలో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
అసెంబ్లీలో సైతం రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించిన హరీష్ రావు… https://t.co/QGAiVKHzFv pic.twitter.com/ukHpVIAbzA
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2026
కొత్వాల్‌గూడలో ఉన్న క్రషర్ల చుట్టూ వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. జీవో నంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్లను నడుపుతున్నదని హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా నిరూపించాయి. హిమాయత్‌సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా విమర్శలు గుప్పించారు. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, ఆ కంపెనీ ఫైన్ కూడా చెల్లించిందని ప్రభుత్వం వెనుకేసుకొచ్చింది.

అయితే విపక్షాలు, స్థానికుల తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్‌లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | దొరల గడీల్లో బందీ అయిన భూమిని విడిపిస్తాం.. పేదలకే సర్వాధికారాలు కల్పిస్తాం: మంత్రి పొంగులేటి
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

Indiramma Indlu | సర్కార్ శుభవార్త.. జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో దశ పంపిణీ
మే 13, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



