త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Car hits Boy | హైద‌రాబాద్.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి

Car hits Boy | హైద‌రాబాద్‌లోని ఐఎస్ స‌ద‌న్ ఎక్స్ రోడ్డులో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఓ ఐదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

S

Hyderabad | Published On Sep 20, 2026, 11.19 am IST

Car hits Boy | హైద‌రాబాద్.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి
Advertisement

Car hits Boy | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్‌లోని ఐఎస్ స‌ద‌న్ ఎక్స్ రోడ్డులో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఓ ఐదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శ‌నివారం రాత్రి మొహియుద్దీన్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వీకార్ హోట‌ల్‌కు వెళ్లాడు. పార్సిల్ తీసుకుంటున్న స‌మ‌యంలో మొహియుద్దీన్ కుమారుడు ఇజ్హాన్ ఉద్దీన్‌ను ఢీకొట్టింది. త‌క్ష‌ణ‌మే బాలుడిని షాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం ఓవైసీ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న వెంటనే మజ్లిస్ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీల ఆదేశాల మేరకు యాకుత్‌పురా మజ్లిస్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీసుల ప్రకారం, ప్రమాదానికి కారణమైన కారు నంబర్‌ను గుర్తించారు. కారు, డ్రైవర్ ఆచూకీని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Advertisement
Advertisement