Saurav Gurjar | పెళ్లి పేరుతో మోసం.. రెజ్లర్ సౌరవ్ గుర్జార్ అరెస్ట్
Saurav Gurjar | పెళ్లి పేరుతో లొంగదీసుకుని, ఆపై ముఖం చాటేసిన నటుడు, రెజ్లర్ సౌరవ్ గుర్జార్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.
Saurav Gurjar | త్రినేత్ర.న్యూస్ : పెళ్లి పేరుతో లొంగదీసుకుని, ఆపై ముఖం చాటేసిన నటుడు, రెజ్లర్ సౌరవ్ గుర్జార్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.
రెజ్లర్ సౌరవ్ గుర్జార్‌కు 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువతి పరియమైంది. ఆ తర్వాత వాట్సాప్ వేదికగా చాటింగ్ చేసుకున్నారు. మరింత సన్నిహితంగా మారిపోయారు. అదే ఏడాది డిసెంబర్ 25న తొలిసారి కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆగస్టు 15న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది.
భార్యతో సమాన హక్కులు కల్పిస్తానని గుర్జార్ హామీ ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. అమెరికాలో ఉన్నప్పుడే కాకుండా, భారత్‌కు వచ్చిన తర్వాత కూడా ఇద్దరం కలిసి జీవించామని వెల్లడించింది. కలిసి వ్యాపారం చేద్దామని నమ్మించడంతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వచ్చానని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి వేధింపుల వల్ల ఉద్యోగంపై దృష్టి పెట్టలేకపోయానని,పెళ్లి గురించి నిలదీసినప్పుడల్లా ఫోన్ బ్లాక్ చేసి దూరమయ్యేవాడని ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న ముంబై ఎయిర్‌పోర్టులో సౌరవ్ గుర్జార్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dil Raju | వినాయక నిమజ్జనం వేడుకల్లో భార్యతో కలిసి దిల్‌రాజు తీన్మార్ డ్యాన్స్
- ●largest Bar in Hyderabad | హైదరాబాద్ లో అతిపెద్ద బార్.. ఎక్కడుందో తెలుసా
- ●Vardhannapeta | మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు.. ఎక్కడో తెలుసా..?
- ●Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు
- ●K Shobha Reddy | సీఎం అపాయింట్మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్‌కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు
- ●CPI Narayana | వరంగల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ

Dil Raju | వినాయక నిమజ్జనం వేడుకల్లో భార్యతో కలిసి దిల్‌రాజు తీన్మార్ డ్యాన్స్

largest Bar in Hyderabad | హైదరాబాద్ లో అతిపెద్ద బార్.. ఎక్కడుందో తెలుసా

Vardhannapeta | మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు.. ఎక్కడో తెలుసా..?

Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు



