త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musi River Rejuvenation | మూసీకి జీవం.. జంట జలాశయాలకు గోదావరి జలాలు

హైదరాబాద్‌ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాల తరలింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

J

Hyderabad | Published On Aug 31, 2026, 4.16 pm IST

Musi River Rejuvenation | మూసీకి జీవం.. జంట జలాశయాలకు గోదావరి జలాలు

సంక్షిప్త సారాంశం

మూసీ నది పునరుజ్జీవనానికి మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు 10 టీఎంసీల సామర్థ్యంతో రెండు భారీ పైప్‌లైన్ల నిర్మాణం జరగనుంది. ఘన్‌పూర్‌లో 1170 MLD సామర్థ్యంతో భారీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (WTP) ఏర్పాటు చేయనున్నారు. బ్యాంక్ లోన్ మంజూరయ్యే వరకు సొంత నిధులతో పనులు ప్రారంభించేందుకు MEIL కు సర్కార్ అనుమతి ఇచ్చింది.

Advertisement
  • భారీ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Musi River Rejuvenation | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నడిబొడ్డున పారుతున్న మూసీ నదికి (Musi River) పునర్జీవం పోసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) కీలక అడుగు వేసింది. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2, ఫేజ్-3లో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నింపేందుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా జంట జలాశయాలను నింపి, మూసీ నదిలో స్వచ్ఛమైన నీరు పారేలా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

మల్లన్నసాగర్ టు ఘన్‌పూర్.. భారీ నెట్‌వర్క్

ఈ ప్రాజెక్టులో ప్యాకేజ్-1 కింద మల్లన్నసాగర్ (Mallannasagar) నుంచి ఘన్‌పూర్ (Ghanpur) వరకు భారీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 3000 మి.మీ వ్యాసం కలిగిన రెండు భారీ ఎంఎస్ (MS) పైప్‌లైన్లను వేయనున్నారు. ఒక్కో పైప్‌లైన్ 10 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మల్లన్నసాగర్ వద్ద భారీ పంప్ హౌస్, సబ్‌స్టేషన్, ఎలక్ట్రో-మెకానికల్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేయనున్నారు.

ఘన్‌పూర్‌లో భారీ ట్రీట్‌మెంట్ ప్లాంట్

గోదావరి నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ఘన్‌పూర్ వద్ద ఏకంగా 1170 MLD సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (WTP) నిర్మించనున్నారు. దీనికి అనుబంధంగా 40 ఎంఎల్ (ML) క్లియర్ వాటర్ రిజర్వాయర్‌, మరో పంప్ హౌస్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

సొంత నిధులతో పనులు ప్రారంభించేలా అనుమతి

ఈ బృహత్తర ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) విధానంలో చేపట్టనున్నారు. రాబోయే పదేళ్ల పాటు ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) బాధ్యతలను కాంట్రాక్ట్ సంస్థే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును 'ఎంఈఐఎల్ (MEIL) మల్లన్నసాగర్ వాటర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్' (SPV) అమలు చేయనుంది. ఇందుకు అవసరమైన బ్యాంకు రుణం మంజూరయ్యే లోపు.. మేఘా ఇంజనీరింగ్ (Megha Engineering) తన సొంత నిధులతో (internal accruals) పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక ఈ ప్రాజెక్టు నియామక తేదీ (DOA)ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో డిసెంబర్ 12, 2025గా నిర్ణయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement