Harish Rao | కృష్ణా జలాల తరలింపుపై రేవంత్ మౌనం.. తెలంగాణకు తీరని ద్రోహం : హరీశ్‌రావు
Harish Rao | కృష్ణా జలాల తరలింపుపై సీఎం రేవంత్‌రెడ్డి మౌనం తెలంగాణకు తీరని ద్రోహమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను బేసిన్ దాటి తరలిస్తున్నా సీఎం చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
Harish Rao | కృష్ణా జలాల తరలింపుపై సీఎం రేవంత్‌రెడ్డి మౌనం తెలంగాణకు తీరని ద్రోహమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను బేసిన్ దాటి తరలిస్తున్నా సీఎం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వ, కేఆర్‌ఎంబీ తీరుపై మండిపడ్డారు. ‘‘నీటి కేటాయింపులు లేకున్నా.. వరద జలాలు రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తుండటం తెలంగాణకు తీరని ద్రోహం. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోంది. ఒకవైపు కృష్ణా బేసిన్‌లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ నిబంధనలు ఉల్లంఘిస్తూ, యథేచ్ఛగా నీటిని తరలిస్తోంది’’ అంటూ మండిపడ్డారు.
నోరెందుకు మెదపడం లేదు..
‘‘మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ! తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇది. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారు? ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కేఆర్ఎంబీ సైతం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షకపాత్ర పోషిస్తే.. రాష్ట్ర నీటి హక్కులను ఎవరు కాపాడాలి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. కేఆర్ఎంబీపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని బీఆర్ఎస్ పక్షాన పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






