త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maha Shivaratri | శైవక్షేత్రాల్లో భ‌క్తుల ర‌ద్దీ.. ఎములాడ రాజ‌న్న‌కు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం

Maha Shivaratri | రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు మ‌హాశివ‌రాత్రి (Maha Shivaratri) శోభ‌ను సంత‌రించుకున్నాయి. ఆదివారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే భ‌క్తులు (Devotees) పెద్ద సంఖ్య‌లో ఆల‌యాల‌కు త‌ర‌లివ‌చ్చారు. ప‌ర‌మ‌శివుడికి అభిషేకాలు, పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.

G

Telangana | Published On Feb 15, 2026, 10.23 am IST

Maha Shivaratri | శైవక్షేత్రాల్లో భ‌క్తుల ర‌ద్దీ.. ఎములాడ రాజ‌న్న‌కు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం
Advertisement

Maha Shivaratri | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు మ‌హాశివ‌రాత్రి (Maha Shivaratri) శోభ‌ను సంత‌రించుకున్నాయి. ఆదివారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే భ‌క్తులు (Devotees) పెద్ద సంఖ్య‌లో ఆల‌యాల‌కు త‌ర‌లివ‌చ్చారు. ప‌ర‌మ‌శివుడికి అభిషేకాలు, పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. భ‌క్తుల ర‌ద్దీతో ఆల‌యాలు ఓం న‌మఃశివాయ నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగుతున్నాయి.

వేముల‌వాడ (Vemulawada) రాజ‌న్న ఆల‌యం అనుబంద దేవ‌స్థానం భీమేశ్వ‌ర స్వామి క్షేత్రంలో మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. స్వామివారిని ద‌ర్శనానికి భారీ స‌భ్య‌లో భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముక్కంటిని మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar), ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ భీమేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కాగా, సాయంత్రం శంక‌ర మ‌ఠంలో అనువంశిక అర్చ‌కుల‌తో మ‌హా లింగార్చ‌న ఉండ‌నుంది. రాత్రి లింగోద్భ‌వం స‌మ‌యంలో స్వామివారికి మ‌హాన్యాస పూర్వ‌క ఏకాద‌శ రుద్రాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు.

ఇక హ‌నుమ‌కొండ‌లోని వేయి స్తంభాల‌గుడిలో రామ‌లింగేశ్వ‌రునికి భ‌క్తులు రుద్రాభిషేకం చేస్తున్నారు. స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని కాళేశ్వ‌రంలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతున్న‌ది. వేకువ‌జాము నుంచే భ‌క్తులు ముక్తేశ‌రుని ద‌ర్శ‌నానికి త‌ర‌లి వ‌స్తున్నారు. త్రివేణి సంగ‌మ గోదావ‌రిలో భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రించి, స్వామివారిని ద‌ర్శించుకుంటున్నారు. దీంతో క్యూలైన్ల‌లో భ‌క్తులు బారులు తీరారు. గ‌ర్భాల‌యంలో స్వామివారికి మారేడు ద‌ళాలు స‌మ‌ర్పించి అభిషేకాలు, ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు.

శ్రీశైలంలోని మల్లికార్జున స్వామివారి ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. మ‌హాశివ‌రాత్రి కావ‌డంతో భ‌క్తుల శివ‌నామ స్మ‌ర‌ణ‌తో ఆల‌యం మారుమ్రోగిపోతున్న‌ది. పాతాళ‌గంగ‌లో స్నాన‌మాచ‌రించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Advertisement
Advertisement