త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LIG Flats | హౌసింగ్ బోర్డు బంపర్ ఆఫర్.. చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే సింగిల్ బెడ్రూం ఎల్ఐజీ ఫ్లాట్స్

LIG Flats | రాష్ట్రంలోని ప్రజల సొంతింటి కలను నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకున్న హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఎల్ఐజి వర్గాల కోసం ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది.

S

Telangana | Published On Dec 18, 2025, 6.08 pm IST

LIG Flats | హౌసింగ్ బోర్డు బంపర్ ఆఫర్.. చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే సింగిల్ బెడ్రూం ఎల్ఐజీ ఫ్లాట్స్
Advertisement

LIG Flats | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజల సొంతింటి కలను నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకున్న హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఎల్ఐజి వర్గాల కోసం ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లోని మొత్తం 339 ఫ్లాట్లను అందుబాటులోని ధరలతో ఎక్కడ ఉన్నవి అలానే అన్న ప్రాతిపదికన విక్రయిస్తున్నది. అల్పాదాయ వర్గాల ప్రజలకు మంచి వసతులతో కూడిన సొంతింటి వసతిని కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అనేక కుటుంబాలు నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ - అపార్ట్‌మెంట్‌లలోని ఫ్లాట్లను ఆ వర్గాలకు చెందిన వారికే కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నామని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవన్నీ కూడా అబివృద్ధి చెందిన, అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ఫ్లాట్లే అని బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలతో విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు.

వివిధ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హౌసింగ్ బోర్టు నిర్మించిన అపార్ట్‌మెంట్‌ల‌లోని ఈ ఫ్లాట్లను ప్రత్యేకించి అఫర్డబుల్ హౌసింగ్ కింద అల్పాదాయ వర్గాల ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో ఏడాదికి రూ. 6 ల‌క్ష‌ల (నెలకు రూ.50 వేలు) ఆదాయం ఉన్న వారికే వీటిని కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌ల‌లో 102, ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్ వద్ద 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకమైన విధానంలో లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు.

ఫ్లాట్ల విస్తీర్ణం 450 చదరపు అడుగుల నుంచి 650 చదరపు అడుగుల వరకు ఉన్నదనీ, గచ్చిబౌలి ప్రాంతంలోని ఫ్లాట్ల ధర రూ.26 లక్షల నుంచి గరిష్టంగా రూ. 36.20 లక్షల వరకు మాత్రమే ఉన్నదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఖమ్మం, వరంగల్‌లో రూ.19 నుంచి రూ. 21.50 లక్షలకు, ఖమ్మంలో రూ.11.25 లక్షలకే అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఈ ప్రాంతాల్లోని ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లోనూ, మీ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చును. గచ్చిబౌలి ప్రాంతం ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ జనవరి 6వ తేదీన, వరంగల్‌లోని ఫ్లాట్ల కేటాయింపు జనవరి 8న, ఖమ్మం ఫ్లాట్ల లాటరీ జనవరి 10వ తేదీన నిర్వహిస్తారు. ఈ విక్రయాలకు సంబధించిన వివరాలన్నీ కూడా హౌసింగ్ బోర్డు వెబ్ సైట్ https://tghb.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement