MLS Sanjay | కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రులకే అనారోగ్యమొచ్చింది
MLS Sanjay | ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి సప్లయర్లు సప్లై ఆపేశారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విమర్శించారు. తెలంగాణలోనే అతి పెద్ద గవర్నమెంట్ క్యాన్సర్ ఆసుపత్రి పరిస్థితి అతి దారుణంగా తయారైందని వాపోయారు.
- ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి సప్లయర్లు సప్లై ఆపేశారు
- ఒక్క మనిషి లేని ఫ్యూచర్ సిటీకి 50 వేల కోట్లట
- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మండిపాటు
MLS Sanjay | త్రినేత్ర న్యూస్: సరైన చికిత్స అందక రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. కేసీఆర్ టైంలో ఈ ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కావాల్సిన అన్ని ఎక్విప్‌మెంట్స్ తెచ్చి పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
నాయకుల బుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలి..
కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా కేసీఆర్ అన్ని తీసుకొచ్చి పెడితే ఇవాళ పరిస్థితి చూడండి. సప్లయర్లు ఆపేసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఈ రాష్ట్రం ఆలోచన విధానం, ప్రభుత్వ నాయకుల బుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్లు ఇప్పటివరకు కూడా ఏ ఒక్క పని కూడా మానవీయ కోణంలో చేయలేదు. ఉన్నవాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటే ఫ్యూచర్ సిటీ అని డ్రామాలు ఆడుతున్నారు. భవిష్యత్ సిటీకి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నరు. రోగుల ప్రాణాలు పోతే పోని అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
స్టెతస్కోప్ విడిచి ప్లకార్డులు పట్టుకుంటున్నరు
కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులకే అనారోగ్యం వచ్చిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్ కష్టపడి వైద్య, ఆరోగ్య రంగాన్ని తీర్చిదిద్దితే.. రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారు. జగిత్యాల మెడికల్ కళాశాల విద్యార్థినులు పోలీసు నిర్బంధంలో ఆందోళన చేస్తున్నారు. స్టెతస్కోప్ పట్టుకోవాల్సిన మెడికల్ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుంటున్నారు. MNJ క్యాన్సర్ ఆసుపత్రికి సప్లయర్లు సరఫరాలు నిలిపివేశారు. దీంతో క్యాన్సర్ రోగులకు మందుల సరఫరా ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. రూ. 200 కోట్లతో అందాల పోటీలకు, లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి కానీ, మెడికల్ కళాశాలలకు ఇవ్వడానికి డబ్బులుండవా?
మీరు హెలికాప్టర్‌లో తిరిగే ఖర్చంత కూడా కాదు
ఒక్క మనిషి లేని చోట 8 లేన్లవి కొత్త కొత్త రోడ్లు వేశారు. మా విద్యార్థులు విద్యకు నోచుకోకుండా ఉన్నరు. పేషెంట్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. సీఎం రేవంత్ హెలికాప్టర్ల తిరిగిన ఖర్చు కంటే అన్ని హాస్పిటళ్లకు కలిసి తక్కువే అవుతుంది. మీ ప్రయారిటీస్ ఏంది? క్యాన్సర్ రోగులు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడతారు. ప్రభుత్వం వైద్య రంగానికి నిధులు కేటాయించడంలో విఫలమైంది. దీనివల్ల పేదలకు ఉచిత వైద్యం అందకుండా పోతోంది.
సంబంధిత వార్తలు

Stock Markets | ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
అక్టోబర్ 9, 2026

KTR | ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం? .. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే: కేటీఆర్
అక్టోబర్ 9, 2026

Domestic Abuse | 15 ఏండ్లుగా చిత్రహింసలు.. భర్త మెడపై కాలుతో తొక్కి చంపిన భార్య
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●KTR | ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం? .. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే: కేటీఆర్
- ●Domestic Abuse | 15 ఏండ్లుగా చిత్రహింసలు.. భర్త మెడపై కాలుతో తొక్కి చంపిన భార్య
- ●HAL Junior Executive | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
- ●Special Trains | పండుగ రద్దీ.. గుంటూరు- వికారాబాద్.. హైదరాబాద్, చర్లపల్లి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు
- ●Dussehra Holidays | బతుకమ్మ సందడి షురూ.. రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు..
- ●UGC NET | యూజీసీ నెట్ డిసెంబర్ 2026 రిజిస్ట్రేషన్ షురూ..

KTR | ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం? .. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే: కేటీఆర్

Domestic Abuse | 15 ఏండ్లుగా చిత్రహింసలు.. భర్త మెడపై కాలుతో తొక్కి చంపిన భార్య

HAL Junior Executive | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

Special Trains | పండుగ రద్దీ.. గుంటూరు- వికారాబాద్.. హైదరాబాద్, చర్లపల్లి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు



