త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sangareddy | సంగారెడ్డి జిల్లాలో తేనెటీగ‌ల బీభ‌త్సం.. గ్రామస్తుల‌పై మూకుమ్మ‌డి దాడి

Sangareddy | సంగారెడ్డి జిల్లా వెంక‌టాపురంలో తేనెటీగ‌లు బీభ‌త్సం సృష్టించాయి. ర‌హ‌దారిపై వెళ్తున్న స్థానికుల‌ను తేనెటీగ‌లు వెంబ‌డించాయి. ముఖంపై దాడి చేయ‌డంతో.. గ్రామ‌స్తులంద‌రూ ఆస్ప‌త్రి పాల‌య్యారు.

S

Telangana | Published On Mar 13, 2026, 1.07 pm IST

Sangareddy | సంగారెడ్డి జిల్లాలో తేనెటీగ‌ల బీభ‌త్సం.. గ్రామస్తుల‌పై మూకుమ్మ‌డి దాడి
Advertisement

Sangareddy | త్రినేత్ర‌.న్యూస్ : సంగారెడ్డి జిల్లా వెంక‌టాపురంలో తేనెటీగ‌లు బీభ‌త్సం సృష్టించాయి. ర‌హ‌దారిపై వెళ్తున్న స్థానికుల‌ను తేనెటీగ‌లు వెంబ‌డించాయి. ముఖంపై దాడి చేయ‌డంతో.. గ్రామ‌స్తులంద‌రూ ఆస్ప‌త్రి పాల‌య్యారు. స్థానిక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో గ్రామ‌స్తులు చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఓ యువ‌కుడు త‌న బైక్‌పై వెంటాపురం ర‌హ‌దారిపై వేగంగా వెళ్తున్నాడు. అత‌న్ని తేనెటీగ‌లు చుట్టుముట్టాయి. ముందుకు వెళ్ల‌లేక బైక్‌ను ఆపేసి.. తేనెటీగ‌ల బారి నుంచి త‌ప్పించుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించాడు. ముఖంపై దాడి చేస్తున్న తేనెటీగ‌ల దాడి త‌ట్టుకోలేక స్థానికంగా ఉన్న ఓ డ్ర‌మ్ములో ఉన్న నీటితో త‌ల‌ను క‌డిగాడు. అయినా కూడా తేనేటీగ‌లు అత‌న్ని వ‌దిలిపెట్ట‌లేదు. ఇందుకు సంబంధించి ఓ సీసీటీవీ ఫుటేజీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Advertisement
Advertisement