Balen Shah | నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేసిన బాలెన్ షా.. అభినందనలు తెలిపిన మోదీ
Balen Shah | నేపాల్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర ప్రారంభమైంది. 34 ఏళ్ల బాలెన్ షా ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. 275 సీట్లు కలిగిన ప్రతినిధుల సభలో 182 సీట్లు గెలిచిన ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) గెలిచిన విషయం తెలిసిందే.
Balen Shah | నేపాల్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర ప్రారంభమైంది. 34 ఏళ్ల బాలెన్ షా ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. 275 సీట్లు కలిగిన ప్రతినిధుల సభలో 182 సీట్లు గెలిచిన ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) గెలిచిన విషయం తెలిసిందే. ర్యాపర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన.. అతిపిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఖాట్మండు మున్సిపల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నేపాల్ రాజకీయాలను మలుపు తిప్పి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. సరికొత్త చరిత్రను లిఖించారు. రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో శుక్రవారం ఆయన అట్టహాసంగా పదవీ బాధ్యతలు సీ్వకరించారు.
కార్యక్రమానికి మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్, ఝలనాథ్ ఖనాల్, బాబురామ్ భట్టారాయ్ సహా మాజీప్రధానులు హాజరుకాగా.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ గైర్హాజరయ్యారు. నాలుగుసార్లు ప్రధానిగా పని చేసిన ఓలీకి.. ఈ ఎన్నికల్లో కేవలం 18,734 ఓట్లు మాత్రమే వచ్చాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చెలరేగగా.. నిరసనల నేపథ్యంలో ఓలీ గతేడాది సెప్టెంబర్ 9న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పీఎంగా బాధ్యతలు స్వీకరించిన బాలెన్ షాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం భారత్-నేపాల్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. భారత్-నేపాల్ స్నేహాన్ని, సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






