Dasoju Sravan Kumar | విద్యావంతుల మౌనంతోనే అనర్హులకు అధికారం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Dasoju Sravan Kumar | విద్యావంతులు ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తే అనర్హులు అధికారంలోకి వస్తారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. యువతే సమాజంలో మార్పునకు పునాది అని, రాజకీయాలపై పట్టభద్రులు నిర్లిప్తత వీడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Dasoju Sravan Kumar | విద్యావంతులు ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తే అనర్హులు అధికారంలోకి వస్తారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. యువతే సమాజంలో మార్పునకు పునాది అని, రాజకీయాలపై పట్టభద్రులు నిర్లిప్తత వీడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు దరఖాస్తు-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దు
గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు, పోలింగ్ శాతం తక్కువగా ఉండటం ఆందోళనకరమని శ్రవణ్ పేర్కొన్నారు. చదువుకున్నవారు ఎన్నికల రోజును సెలవు దినంగా భావించి ఓటు వేయకపోవడం సరికాదన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పట్టభద్రుడి బాధ్యతని స్పష్టం చేశారు. యువత చైతన్యంతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ కృషితో హైదరాబాద్‌కు అంతర్జాతీయ సంస్థలు, భారీ పెట్టుబడులు వచ్చాయని, సుమారు 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడిందని శ్రవణ్ తెలిపారు. అయితే, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలతో నగరం ప్రతిష్ఠ దెబ్బతింటోందని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల భర్తీ ఏదీ?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు, కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు, తాగు, సాగునీటి సమస్యలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చిందని శ్రవణ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన సమాధానం చెప్పాలని, బీఆర్‌ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి మాజీ కార్పొరేటర్ మహేశ్ యాదవ్, బీఆర్‌ఎస్‌వీ నాయకుడు మధుకర్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahul Gandhi | ఓటు చోరీని అడ్డుకోవాలి.. ఎస్ఐఆర్ను నిలిపివేయాలి : రాహుల్‌గాంధీ
అక్టోబర్ 11, 2026

Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్!
అక్టోబర్ 11, 2026

Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●Faria Abdullah | కమల్‌హాసన్ డైరెక్టర్‌తో ఫరియా అబ్దుల్లా తెలుగు వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే
- ●Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్!
- ●Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే
- ●Djibouti Boat Capsizes Migrants | గల్ఫ్ కలల బాటలో ఘోర విషాదం: మునిగిన శరణార్థుల బోటు.. 15 మంది చిన్నారులతో సహా 100 మందికి పైగా మృతి
- ●Keerthi Reddy | పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ హీరోయిన్... ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Mysore Dasara 2026 | మైసూర్ దసరా 2026: వైభవంగా 'నాడ హబ్బ' ప్రారంభం.. 750 కిలోల బంగారు అంబారీ, రాజసం ఉట్టిపడే విశేషాలివే!

Faria Abdullah | కమల్‌హాసన్ డైరెక్టర్‌తో ఫరియా అబ్దుల్లా తెలుగు వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే

Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్!

Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే

Djibouti Boat Capsizes Migrants | గల్ఫ్ కలల బాటలో ఘోర విషాదం: మునిగిన శరణార్థుల బోటు.. 15 మంది చిన్నారులతో సహా 100 మందికి పైగా మృతి



