త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court | లైన్ క్లియర్.. గ్రూప్-1 ఉద్యోగుల ఎంపిక సక్రమమే: హైకోర్టు

High Court | గ్రూప్‌-1 (Group 1) ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఊర‌ట ల‌భించింది. గ్రూప్‌-1 ఉద్యోగాల నియామాల‌కు హైకోర్టు (High Court) డివిజ‌న్ బెంచ్ లైన్ క్లియ‌ర్ చేసింది.

G

Telangana | Published On Feb 5, 2026, 11.38 am IST

High Court | లైన్ క్లియర్.. గ్రూప్-1 ఉద్యోగుల ఎంపిక సక్రమమే: హైకోర్టు
Advertisement

High Court | త్రినేత్ర‌.న్యూస్‌: గ్రూప్‌-1 (Group 1) ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఊర‌ట ల‌భించింది. గ్రూప్‌-1 ఉద్యోగాల నియామాల‌కు హైకోర్టు (High Court) డివిజ‌న్ బెంచ్ లైన్ క్లియ‌ర్ చేసింది. జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్టును ర‌ద్దుచేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. గ్రూప్-1 పరీక్షలు పారదర్శకంగా జరిగాయని, పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని సీజే ధ‌ర్మాస‌నం తీర్పును వెలువ‌రించింది.

టీజీపీఎస్సీ 562 ఉద్యోగాల భ‌ర్తీకి గ్రూప్-1 ప‌రీక్ష నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాలంటూ ప‌లువురు అభ్య‌ర్థులు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన‌ సింగిల్ బెంచ్ జడ్జి జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాల‌ను మళ్లీ మూల్యాంకనం చేయాలని, అలా వీలుకాని ప‌క్షంలో ఎనిమిది నెల‌లోపు ప‌రీక్ష‌ను మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీచేశారు.

సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థుల హైకోర్టులో అప్పీల్ చేశారు. గ‌తేడాది ఫిబ్రవరి 5న అప్పీల్ ను విచారించిన హైకోర్టు సీజే ధ‌ర్మాస‌నం.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. నియామ‌క ప్ర‌క్రియ‌ను కొన‌సాగించాల‌ని, అది తుది తీర్పున‌కు లోబ‌డి ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించిన టీజీపీఎస్సీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసింది. అనంత‌రం ఉద్యోగాల‌కు ఎంపికైన 562 మందికి 2025 సెప్టెంబర్ 27న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు.

2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 21 వేల మందికి పైగా పరీక్షలకు హాజ‌ర‌య్యారు. మొత్తం 563 పోస్టులకు గాను 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్ 1 టాపర్‌‌గా లక్ష్మీదీపిక నిలిచారు.

Advertisement
Advertisement