త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court CJ | క‌క్షిదారుల‌కు స‌త్వ‌ర న్యాయం : హైకోర్టు సీజే

High Court CJ | కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అప‌రేష్‌ కుమార్ సింగ్ తెలిపారు.

S

Telangana | Published On Mar 7, 2026, 7.13 pm IST

High Court CJ | క‌క్షిదారుల‌కు స‌త్వ‌ర న్యాయం : హైకోర్టు సీజే
Advertisement

రాజ్యాంగ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేయాలి
న్యాయ‌మూర్తులు స‌మ‌ర్థివంతంగా ప‌ని చేయాలి
పెండింగ్ కేసుల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాలి
సిరిసిల్ల జిల్లా కోర్టుకు వ‌ర్చువ‌ల్‌గా హైకోర్టు సీజే శంకుస్థాప‌న‌

High Court CJ | త్రినేత్ర‌.న్యూస్ : కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అప‌రేష్‌ కుమార్ సింగ్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సుమారు 5 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 81 కోట్ల 60 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మాణం చేప‌ట్ట‌బోయే నూతన కోర్టు బిల్డింగ్ సముదాయానికి వ‌ర్చువ‌ల్ విధానంలో సీజే జ‌స్టిస్ అప‌రిష్ కుమార్ సింగ్ శంకుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్ అప‌రేష్‌ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. నూతన కోర్టు భవన సముదాయం అన్ని కోర్టుల నిర్వహణకు సరిపోయే విధంగా ఉంటుందని వెల్లడించారు. నూతన కోర్టులో మౌలిక వసతులతోపాటు తగినంత సిబ్బంది ఉండాలని సూచించారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టుకు వచ్చే కక్షి దారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. జిల్లా కోర్టులో 13 వేల కేసులు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. పెండింగ్ కేసుల‌ పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆదేశించారు.

న్యాయవ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం

ఈ నూతన కోర్టు భవన నిర్మాణం ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే కొత్త అధ్యాయానికి నాందిగా నిలుస్తుందని హైకోర్టు న్యాయమూర్తి కం జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ పేర్కొన్నారు. రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందేలా న్యాయవ్యవస్థ పని చేయాలన్నారు. ప్రతి పౌరుడు న్యాయస్థానాన్ని ఆశతో, నమ్మకంతో ఆశ్రయించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను కాపాడే న్యాయవ్యవస్థకు ఉన్న నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. నిష్పక్షపాతం.. నైతిక విలువలు కాపాడడం అత్యంత ముఖ్యమని ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, న్యాయ పరిపాలన, సమానత్వం, నాణ్యమైన న్యాయ సేవలు అందేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బార్ సభ్యులు సత్యాన్ని వెలికితీసే బాధ్యతతో పని చేస్తూ ప్రజలకు న్యాయం అందేలా అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు.

Advertisement
Advertisement