త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court | విద్యార్థుల నుంచే ఫీజులు వ‌సూలు చేసుకోండి..

High Court | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు (Fee Reimbursement) అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజినీరింగ్‌ కాలేజీలకు (Engineering Colleges) హైకోర్టు (High Court) స్ప‌ష్టంచేసింది. ప్రభుత్వం చెల్లించిన తర్వాత ఆ మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.

G

Telangana | Published On Apr 4, 2026, 7.56 am IST

High Court | విద్యార్థుల నుంచే ఫీజులు వ‌సూలు చేసుకోండి..
Advertisement

High Court | త్రినేత్ర‌.న్యూస్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు (Fee Reimbursement) అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజినీరింగ్‌ కాలేజీలకు (Engineering Colleges) హైకోర్టు (High Court) స్ప‌ష్టంచేసింది. ప్రభుత్వం చెల్లించిన తర్వాత ఆ మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. 2026–27 విద్యాసంవ‌త్స‌రం నుంచి విద్యార్థుల వ‌ద్ద ఫీజులు వ‌సూలు చేసుకోవ‌చ్చ‌ని తేల్చిచెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం సకాలంలో చెల్లించటం లేదని, అందువల్ల ఫీజులను విద్యార్థుల నుంచే వసూలు చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేశవ్‌ మెమోరియల్‌ సహా 15 కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

దీనిపై విచారించిన జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేర‌కు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీచేసింది. అయితే, తుది తీర్పునకు లోబడి ఫీజుల వసూలు విధానం ఉంటుందని, తుదితీర్పు మధ్యంత ఉత్త్తర్వులకు భిన్నంగాఉంటే విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులను కాలేజీలు తిరిగి చెల్లించాల‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఈ కేసులో వాస్త‌వాలు, ప‌రిస్థితులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాత అనేక ఏండ్లుగా కాలేజీల‌కు స‌ర్కార్ నుంచి రూ.వేల కోట్లు బ‌కాయి ఉంద‌ని పేర్కొంది. టోకెన్లు జారీచేసినా విడుద‌ల‌లో జాప్యం కార‌ణంగా ఇలాంటి ఉత్త‌ర్వులు ఇవ్వాల్సి వ‌స్తున్న‌ద‌ని స్ప‌ష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement