త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Bhagirath | నాపై న‌మోదైన‌ కేసు కొట్టేయండి.. హైకోర్టులో బండి భ‌గీర‌థ్ పిటిష‌న్

Bandi Bhagirath | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 14న వెకేషన్‌ బెంచ్‌లో విచారణ జరగనుంది.

S

Telangana | Published On May 12, 2026, 5.38 pm IST

Bandi Bhagirath | నాపై న‌మోదైన‌ కేసు కొట్టేయండి.. హైకోర్టులో బండి భ‌గీర‌థ్ పిటిష‌న్
Advertisement

Bandi Bhagirath | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 14న వెకేషన్‌ బెంచ్‌లో విచారణ జరగనుంది. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ క‌రీంన‌గర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా 8వ తేదీనే కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసు రాజకీయంగా దుమారం రేపడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్వయంగా డీజీపీ సీవీ ఆనంద్‌ను పిలిపించుకొని కేసు వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా విచారణ జరపాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్​కు కేసు బాధ్యతలు అప్పగిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ బాలికను మరోసారి విచారించి వాంగ్మూలం నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు..

Advertisement
Advertisement