త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Herbicides | గ‌డ్డి, క‌లుపు మందుల‌ను నిషేధించండి.. సీఎంకు రైతు క‌మిష‌న్ బృందం విజ్ఞ‌ప్తి

Herbicides | గడ్డి, కలుపు మందులను నిషేధించాలని అసెంబ్లీ ఆవరణంలో సీఎం రేవంత్ రెడ్డిని, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును రైతు క‌మిష‌న్ బృందం కలిసి నివేదికను అందజేశారు.

S

Telangana | Published On Mar 16, 2026, 6.52 pm IST

Herbicides | గ‌డ్డి, క‌లుపు మందుల‌ను నిషేధించండి.. సీఎంకు రైతు క‌మిష‌న్ బృందం విజ్ఞ‌ప్తి
Advertisement

Herbicides | త్రినేత్ర‌.న్యూస్ : గడ్డి, కలుపు మందులను నిషేధించాలని అసెంబ్లీ ఆవరణంలో సీఎం రేవంత్ రెడ్డిని, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును రైతు క‌మిష‌న్ బృందం కలిసి నివేదికను అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలకు పైగా ఈ గడ్డి, కలుపు మందులను బ్యాన్ చేస్తే.. మన దేశంలో మాత్రం విచ్చల విడిగా అమ్మకాలు చేస్తున్నారని, రైతులు క్షణికావేశంలో వాటిని తాగడం చనిపోతున్నారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం వీటిని నిషేదించాలని కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తండాల్లో ఎక్కువగా రైతుల మరణాలకు ఈ గడ్డి, కలుపు ముందుకే కారకులుగా వున్నాయి. తెలంగాణలో నిషేధించడం తోపాటు దేశ వ్యాప్తంగా నిషేధించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖరాయాలని సీఎంను కోరారు.

రైతు కమిషన్ ప్రతిపాదనను అసెంబ్లీలో చర్చిస్తామని, ఇలాంటి విషకారకులను రాష్ట్రంలో నిషేదించేలా చర్యలు చేపడ్తామని హామీ ఇచ్చారు. ఇక మంత్రి తుమ్మల సైతం కమిషన్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ఇదే అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి రిపోర్ట్‌ను అందజేశారు.

రైతు కమిషన్ బృందంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, చెవిటి వెంకన్న , భవానీ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్ తదితరులున్నారు.

Advertisement
Advertisement