Heavy Temperatures | మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు
Heavy Temperatures | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు (Heavy Temperatures) నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు.
Heavy Temperatures | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు (Heavy Temperatures) నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల మధ్య జనాలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. శుక్ర, శనివారాల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సిరిసిల్ల (శుక్ర, శనివారాల్లో), కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం (శుక్రవారం), ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో రానున్న మూడు రోజులు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు అధిక ఉష్ణోగ్రతల వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని, తద్వారా ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 19న జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో, 20న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలు, వడగళ్లతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది.
కాగా, గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాది ఇంతవరకు ఇదే రికార్డు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. మరో 8 జిల్లాల్లో 43 నుంచి 43.8 డిగ్రీల మధ్య, 11 జిల్లాల్లో 42 నుంచి 42.9 డిగ్రీలు, 4 జిల్లాల్లో 41.5-41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



