TG Weather | తెలంగాణలో భారీగా పెరుగనున్న ఉష్ణోగ్రతలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..!
TG Weather | తెలంగాణలో మరోసారి ఎండలు పెరుగుతాయని వాతావరశాఖ హెచ్చరించింది. మంగళవారం నుంచి క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి 22 తేదీల మధ్య తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
TG Weather | తెలంగాణలో మరోసారి ఎండలు పెరుగుతాయని వాతావరశాఖ హెచ్చరించింది. మంగళవారం నుంచి క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి 22 తేదీల మధ్య తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో తూర్పు తెలంగాణ జిల్లాల్లో 47 డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగత్రలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ పగటి ఉష్ణోగత్రలు 43 డిగ్రీల దాకా చేరే సూచనలున్నాయని అధికారులు వెల్లడించారు. ఎండలకు తోడు వడగాలులు వీచే ఛాన్స్ ఉందని, దాదాపుగా పదిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇటీవల, రెండుమూడురోజులు ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గాయి. ఆదివారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సాలూరలో 43.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లా బాలానగర్‌లో 40.2 డిగ్రీలుగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఉష్ణోగత్రల్లో పెద్దగా మార్పు ఉండదని, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణ స్థాయితో పోలిస్తే మరో రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరుగవచ్చని పేర్కొంది. ఇలా ఉండగా.. సోమవారం, మంగళవారం పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






