Heatstroke | వడదెబ్బతో ఒక్కరోజే 51 మంది మృతి.. ఉమ్మడి వరంగల్‌లోనే 23 మంది
Heatstroke | రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి ప్రతాపంలో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. వడగాల్పులు (Heatwave) వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వరుసగా రెండో రోజూ వడదెబ్బతో (Heatstroke) 30 మందికిపైగా మృతిచెందారు.
Heatstroke | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి ప్రతాపంలో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. వడగాల్పులు (Heatwave) వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వరుసగా రెండో రోజూ వడదెబ్బతో (Heatstroke) 30 మందికిపైగా మృతిచెందారు. శుక్రవారం 34 మంది మరణించగా, శనివారం ఈ సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలతో ఏకంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్క ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోనే 22 మంది ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, కూలీలే ఉండటం గమనార్హం. కాగా, గత మూడు రోజుల్లో రాష్ట్రంలో వడదెబ్బతో 100 మందికిపైగా మరణించారు.
మృతుల వివవరాలు..
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన రోజువారీ కూలీ పెద్దమ్మ కుమారస్వామి (60), వరంగల్ 41వ డివిజన్ విశ్వనాథ కాలనీకి చెందిన నాయీబ్రహ్మణుడు సింగారపు కుమారస్వామి (45), రంగశాయిపేట కాపువాడకు చెందిన శెంకేశి భాగ్యలక్ష్మి(60), పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దొడ్డ సత్యనారాయణ, రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన చిన్నపాక యాకయ్య (50) ఎండలకు మరణించారు.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బండ చిన్నమల్లయ్య(90), కక్కిరాలపల్లికి చెందిన అలువాల నీలమ్మ(80), ఇదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి శాంతమ్మ(90), ఎల్కతుర్తి మండలం పెంచికలపేటకు చెందిన దుగ్యాని కొమురయ్య(101), కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన పొడేటి లచ్చమ్మ (82), పరకాల శ్రీనివాసకాలనీకి చెందిన టైలర్ వెల్దండి వెంకటేశ్వర్లు(48) చనిపోయారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దుర్గం అంకయ్య(65), కాటారం రేగులగూడెం జీపీ పరిధిలో భూయాన్ వినోద్(35), కాళేశ్వరంలో సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చిన గుర్తు తెలియని భక్తుడు(50) వడదెబ్బతో మృతిచెందారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడేనికి చెందిన హమాలీ కార్మికుడు గొడిశాల పరశురాములు(55), జనగామ అంబేడ్కర్ నగర్‌కు చెందిన యాచకురాలు జ్యోతి(58), ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రునిపేటకు చెందిన రైతు ఊటుకూరి సోమిరెడ్డి(78) చనిపోయారు.
మహబూబాబాద్ జిల్లాలో కురవి మండలం బలపాలకు చెందిన రొయ్యల పెద్దరాములు(75), బంగారుగూడెం తండా గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూడు జాన్వు(38), సీరోలు మండలం బీల్యానాయక్ తండాకు చెందిన బానోత్ కమ్లి(65), డోర్నకల్ యాదవనగర్‌కు చెందిన జానీమియా(43), గూడూరు మండల కేంద్రానికి చెందిన పెసరి వీరమల్లు (70) చనిపోయారు.
నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ఎర్రచెరువుతండాకు చెందిన రైతు ఆంగోతు యుగేంధర్(32), మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురానికి చెదిన షేక్ ఇస్మాయిల్ (38), యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంకు చెందిన కార్పెంటర్ దేవరకొండ శంకరయ్యచారి(65), మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వరికుప్పల శంకరయ్య(65), ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్‌కు చెందిన చెన్న హరికిషన్ (50), సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో చౌగోని దుర్గాప్రసాద్ (30) వడదెబ్బ తగిలి మృతిచెందారు.
పెద్దపల్లిలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన దినసరి కూలీ ఫయాజ్ (52), సుల్తానాబాద్ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన న్యాతరి మొండయ్య (76), ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల మధుసూదన్‌రెడ్డి (53), రామగిరి మండలం ఆదివారంపేటకు చెందిన బుడిగె కమల(65), యైటింక్లయిన్‌కాలనీ వెంకట్రావుపల్లి కేకేనగర్‌కు చెందిన కనుకుట్ల ఐలమ్మ(73), గోదావరిఖని పరుశరాంనగర్‌కు చెందిన ఎం.శంకర్(45), గోదావరిఖనిలో వెల్దండి మహేశ్(52), ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మీకురాలు గజనవేని మల్లమ్మ(56), రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంచాల నరసయ్య(75), మిట్టపల్లి శంకర్(48), కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దామెరశెట్టి మల్లేశం (52) వడదెబ్బతో మృతిచెందారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన రామగిరి పుల్లమ్మ(78), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గోపాల్‌నగర్‌కు చెందిన సట్వే శంకర్(50), గణేశ్‌నగర్‌కు చెందిన ఎనుపోతుల బాబు(65) వడదెబ్బతో చనిపోయారు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
పలు జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లాలో కుంచవెళ్లి, కాగజ్‌నగర్‌లో 46.4, జగిత్యాల జిల్లా ధర్మపురి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 46.3, ఖమ్మం రూరల్, అదే జిల్లా వైరా, మంచిర్యాల జిల్లా తాండూరులో 46.1 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకుపైగా నమోదైంది. ఇక ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతున్నది. రోజువారీ విద్యుత్తు వినియోగం 101.07 మిలియన్ యూనిట్లుగా రికార్డయింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ పూజలు - మరో వివాదానికి పుల్‌స్టాప్!
- ●Harish Rao | కొడంగల్ లంబాడీ బిడ్డలే రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతారు : హరీశ్‌రావు
- ●Pregnant Women | గర్భిణీలకు అలర్ట్.. థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు ఏఎస్డీ ప్రమాదం..
- ●Devi Prasad | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు నిలిపివేయాలి: దేవీప్రసాద్ డిమాండ్
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ పూజలు - మరో వివాదానికి పుల్‌స్టాప్!

Harish Rao | కొడంగల్ లంబాడీ బిడ్డలే రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతారు : హరీశ్‌రావు

Pregnant Women | గర్భిణీలకు అలర్ట్.. థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు ఏఎస్డీ ప్రమాదం..

Devi Prasad | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు నిలిపివేయాలి: దేవీప్రసాద్ డిమాండ్





