Devi Prasad | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు నిలిపివేయాలి: దేవీప్రసాద్ డిమాండ్
Devi Prasad | పెట్రోల్ డిజిల్ ధరలు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న మంత్రికి ముందు వడ్లు కొనమని చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు వేయడం అన్యాయమని ఉద్యోగ సంఘాల జాక్ మాజీ చైర్మన్ మండిపడ్డారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
Devi Prasad | త్రినేత్ర.న్యూస్: పెట్రోల్ డిజిల్ ధరలు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న మంత్రికి ముందు వడ్లు కొనమని చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు వేయడం అన్యాయమని ఉద్యోగ సంఘాల జాక్ మాజీ చైర్మన్ మండిపడ్డారు. కార్మికులకు ప్రజల పక్షాన మాట్లాడే ట్రేడ్ యూనియన్ హక్కులు ఉంటాయనే విషయం తెలియకుండా మూర్ఖంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడడం కనీస బాధ్యతగా భావించిన అశోక్ ను అభినందిస్తున్నామని తెలిపారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల గురించి జగిత్యాలలో ధర్నా చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుంటే ముందు వడ్లు కొనండని చెప్పినందుకు డ్రైవర్‌ది తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. జగిత్యాల డిపోకు చెందిన బస్ డ్రైవర్ పై వేటు వేసి డ్యూటీకి రావద్దని రిమూవల్ లెటర్ ఇచ్చిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానని అశోక్ తెలిపాడు అని దేవీప్రసాద్ అన్నారు.
కార్మిక హక్కుల ఉల్లంఘన కాదా?
ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ ద్వారా డ్యూటీకి రావద్దని సూచించిటం కార్మిక హక్కుల ఉల్లంఘన కాదా? వెంటనే అశోక్ పై చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మంత్రిగారికి తెలియదా? అని దేవీప్రసాద్ నిలదీశారు.
సంబంధిత వార్తలు

Kayadu Lohar | కోలీవుడ్ డైరెక్టర్ బయోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్లు – బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్
మే 26, 2026

Marco Rubio Taj Mahal | తాజ్ మహల్ దగ్గర మార్కో రూబియో ఫోటోషూట్.. చరిత్ర తెలిస్తే ఇలా చేయరంటూ ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
మే 26, 2026

Harish Rao | సింగరేణికి రేవంత్ సర్కార్ బకాయి రూ. 50 వేల కోట్లపైనే : హరీశ్‌రావు
మే 26, 2026
తాజావార్తలు
- ●Kayadu Lohar | కోలీవుడ్ డైరెక్టర్ బయోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్లు - బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్
- ●Marco Rubio Taj Mahal | తాజ్ మహల్ దగ్గర మార్కో రూబియో ఫోటోషూట్.. చరిత్ర తెలిస్తే ఇలా చేయరంటూ ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
- ●Harish Rao | సింగరేణికి రేవంత్ సర్కార్ బకాయి రూ. 50 వేల కోట్లపైనే : హరీశ్‌రావు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన సూచీలు..
- ●IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. అయితే ఈ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాల్సిందే..
- ●Annamalai | నేరగాళ్లకు స్వేచ్ఛ లభించింది.. సెలబ్రేషన్ మూడ్ నుంచి బయటకు రండి.. విజయ్‌పై అన్నామలై ధ్వజం

Kayadu Lohar | కోలీవుడ్ డైరెక్టర్ బయోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్లు - బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్

Marco Rubio Taj Mahal | తాజ్ మహల్ దగ్గర మార్కో రూబియో ఫోటోషూట్.. చరిత్ర తెలిస్తే ఇలా చేయరంటూ ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

Harish Rao | సింగరేణికి రేవంత్ సర్కార్ బకాయి రూ. 50 వేల కోట్లపైనే : హరీశ్‌రావు

Stock Markets | స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన సూచీలు..



