త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఆ ఐదు న‌గ‌రాల నుంచి గుణ‌పాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | దేశంలోని ఆ ఐదు న‌గ‌రాల నుంచి మ‌నం గుణ‌పాఠం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లేదంటే మ‌న హైద‌రాబాద్ న‌గ‌రం కూడా ఆ న‌గ‌రాల మాదిరే త‌యార‌వుతుంద‌ని సీఎం హెచ్చ‌రించారు.

S

Hyderabad | Published On Jun 8, 2026, 7.25 pm IST

CM Revanth Reddy | ఆ ఐదు న‌గ‌రాల నుంచి గుణ‌పాఠం నేర్చుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలోని ఆ ఐదు న‌గ‌రాల నుంచి మ‌నం గుణ‌పాఠం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లేదంటే మ‌న హైద‌రాబాద్ న‌గ‌రం కూడా ఆ న‌గ‌రాల మాదిరే త‌యార‌వుతుంద‌ని సీఎం హెచ్చ‌రించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( CMC) పరిధిలో రూ. 1674.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

దేశ వ్యాప్తంగా 140 కోట్ల జ‌నాభా ఉంది. 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆరు పెద్ద న‌గ‌రాలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు, క‌ల‌క‌త్తా, చెన్నై, హైద‌రాబాద్.. ఈ న‌గ‌రాలే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను న‌డిపిస్తున్నాయి. ఢిల్లీలో ప్ర‌ధాని నుంచి సీజేఐ, రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ప్ర‌ముఖులంద‌రూ ఉంటారు. కానీ ఢిల్లీ న‌గ‌ర ప‌రిస్థితి గురించి ఆలోచించండి. కాలుష్యాన్ని నియంత్రించ‌క‌పోవ‌డం వ‌ల్ల పాఠ‌శాల‌లు, కార్యాల‌యాలు, పార్ల‌మెంట్ బంద్ పెట్టి కాలుష్యాన్ని ఎదుర్కొలేక ఢిల్లీని ప‌డావుపెట్టే ప‌రిస్థితి దాపురించింది అని సీఎం తెలిపారు.

ముంబై న‌గ‌రం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను శాసిస్తుంది. అలాంటి ముంబైలో ట్రాఫిక్ జామ్‌లే కాదు.. వ‌ర్షం వ‌స్తే గంట‌ల కొద్ది రోడ్ల మీద నిలిచిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముంబై న‌గ‌రంలో స్ల‌మ్స్‌తో పాటు నివ‌సించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక బెంగ‌ళూరు న‌గ‌రం ఐటీ అభివృద్ధికి పేరుగాంచింది.. కానీ ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు ఎప్పుడు చేరుకుంటామో తెలియ‌ని ప‌రిస్థితి. బెంగ‌ళూరులో ఉన్న ట్రాఫిక్ స‌మ‌స్య వ‌ల్ల పెద్ద కంపెనీలు హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చాయి. చెన్నైలో వ‌ర్షాలు వ‌స్తే అపార్ట్‌మెంట్లు, కాల‌నీలు, కార్యాల‌యాలు వ‌ర్ష‌పు నీటితో నిండిపోయాయి. నీళ్ల‌ల్లో, ప‌డ‌వ‌ల్లో ప్ర‌యాణించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. క‌ల‌క‌త్తాలో శాంతి భ‌ద్ర‌త‌లు స‌రిగా లేవు. ఈ ఐదు న‌గ‌రాల నుంచి గుణ‌పాఠం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. తెలంగాణ‌లో ప్ర‌జాపాల‌న‌లో భాగంగా రాష్ట్రానికి భ‌విష్య‌త్ త‌రాల‌కు అవ‌స‌ర‌మ‌ని చెప్పి రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఓఆర్ఆర్, అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టు మ‌న న‌గరానికి ఉంది. ఓఆర్ఆర్ లోప‌ల ఒక కోటి 34 ల‌క్ష‌ల జ‌నాభా ఉంది. ఇత‌ర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల కోసం ల‌క్ష‌లాదిలాగా త‌ర‌లివ‌స్తున్నారు. ప్ర‌తి ఏడాది 3 శాతం జ‌నాభా పెరిగిపోతుంది మ‌హాన‌గ‌రంలో. అలాంటి మ‌హాన‌గ‌రాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement