త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arun Kumar Tiwari | ప‌ర‌మ శివుడి చెంత‌నే.. ఎవ‌రెస్టుపైనే ప‌ర్వ‌తారోహ‌కుడు అరుణ్ తివారి మృత‌దేహం

Arun Kumar Tiwari | ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన శిఖ‌ర‌మైన ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తాన్ని (Mount Everest) అధిరోహించి త‌న క‌ల‌ను సాకారం చేసుకున్నాడు. అదే అనందంలో తిరిగివ‌స్తూ క‌న్నుమూశాడు.

G

Telangana | Published On May 28, 2026, 10.17 am IST

Arun Kumar Tiwari | ప‌ర‌మ శివుడి చెంత‌నే.. ఎవ‌రెస్టుపైనే ప‌ర్వ‌తారోహ‌కుడు అరుణ్ తివారి మృత‌దేహం
Advertisement

Arun Kumar Tiwari | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన శిఖ‌ర‌మైన ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తాన్ని (Mount Everest) అధిరోహించి త‌న క‌ల‌ను సాకారం చేసుకున్నాడు. అదే అనందంలో తిరిగివ‌స్తూ క‌న్నుమూశాడు. ఆక్సిజ‌న్ త‌క్కువ‌గా ఉండే ఆ ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాంతం నుంచి మృత‌దేహాన్ని తీసుకురావ‌డం శ్ర‌మ‌తో కూడుకున్నది. దీంతో అత‌ని కుటుంబ స‌భ్యులు భౌతిక‌కాయాన్ని అక్క‌డే ఉంచేయాల‌ని నిర్ణ‌యించారు. ఆయ‌న సాక్షాత్తు ప‌ర‌మ శివుడి (Lord Shiva) చెంత‌నే ఉన్నార‌ని చెబుతూ భావోద్వేగానికి గుర‌వుతున్నారు.

హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ ప‌ర్వ‌తారోహ‌కుడు 53 ఏండ్ల‌ అరుణ్ కుమార్ తివారీ (Arun Kumar Tiwari) గ‌త‌వారం విజ‌య‌వంతంగా ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని (Mount Everest) అధిరోహించారు. తిరుగు ప్ర‌యాణంలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా ఉండి, క్షణక్షణానికి వాతావరణం మారిపోయే ప్రమాదకర ప్రాంతం 8,790 మీటర్ల ఎత్తులో ఉన్న‌ `హిల్లరీ స్టెప్‌` వ‌ద్ద అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న అక్క‌డే ప్రాణాలు వ‌దిలారు. ఆయ‌న‌తోపాటు మ‌రో ఇద్ద‌రు ప‌ర్వాత‌రోహ‌కులు కూడా తీవ్ర అస్వ‌స్థ‌త పాల‌య్యారు. వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని హిందూపురానికి చెందిన‌, అమెరికాలో స్థిర‌ప‌డిన ఐటీ ప్రొఫెష‌న‌ల్ సందీప్ ఆరే (46) ఎవ‌రెస్టును అధిరోహించిన (మే 20న‌) మ‌రుస‌టి రోజే తీవ్ర అల‌స‌ట‌, స్నో బ్లైండ్‌నెస్‌తో మ‌ర‌ణించారు. మరో హైదరాబాదీ ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, సందీప్ మృత‌దేహాన్ని షెర్పాలు కింద‌కు తీసుకురాగా, బెంగ‌ళూరులో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

అయితే 8 వేల మీట‌ర్ల ఎత్తుకు పైబ‌డిన డెత్ జోన్‌లో ప‌రిస్థితులు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉంటంతో అరుణ్ మృత‌దేహాన్ని కిందికి తీసుకురావ‌డం అసాధ్య‌మ‌ని నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు.. `ప‌ర‌మ శివుడి నివాస‌మైన కైల‌మే ఎవ‌రెస్ట్‌. ఆయ‌న అక్క‌డే శాశ్వ‌తంగా విశ్రాంతి తీసుకోవాల‌ని భావించామ‌ని, అరుణ్ శరీరాన్ని అక్క‌డే ఉంచేయాలని నిర్ణయించుకున్నామని` చెప్పారు.

హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ ఐటీ కంపెనీలో సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న అరుణ్.. అనుభ‌వ‌జ్ఞుడైన ప‌ర్వ‌తారోహ‌కుడు కూడా. ఇప్ప‌టికే మౌంట్ ఎల్బ్ర‌స్‌, డెనాలి, అకోన్కాగ్వా వంటి ప‌ర్వ‌తాల‌ను అధిరోహించారు. గత ఏడాది ఎవ‌రెస్టు శిఖారాన్ని ఎక్కేందుకు ప్రయత్నించినా.. 7,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లాక అనారోగ్య కారణాలతో వెనక్కి వచ్చేశారు. అయితే ఈసారి త‌న క‌ల‌ను సాకారం చేసుకున్న‌ప్ప‌టికీ.. కుటుంబ స‌భ్యులు చెబుతున్న‌ట్లుగా ఆ ప‌ర‌మ‌శివుడి ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
Advertisement