త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etela Rajender | భూదాన్ భూముల స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్చ‌లు జ‌ర‌పాలి : ఈట‌ల రాజేంద‌ర్‌

Etela Rajender | కూకట్‌పల్లి ఏబీవీ పురం భూదాన్ భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఐడీపీఎల్ అధికారులు కలిసి చర్చించాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఈ సమస్యపై స్థానికులతో ఆయన సమావేశమై వారి ఆందోళనలను విన్నారు.

P

Telangana | Published On May 23, 2026, 7.37 pm IST

Etela Rajender | భూదాన్ భూముల స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్చ‌లు జ‌ర‌పాలి : ఈట‌ల రాజేంద‌ర్‌
Advertisement

Etela Rajender | కూకట్‌పల్లి ఏబీవీ పురం భూదాన్ భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఐడీపీఎల్ అధికారులు కలిసి చర్చించాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఈ సమస్యపై స్థానికులతో ఆయన సమావేశమై వారి ఆందోళనలను విన్నారు. హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన పేదలు ఇక్కడ జీవిస్తున్నారని ఆయన అన్నారు. ఇండ్లలో పని చేసే మహిళలు, కూలీలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు సొంత ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ, భూదాన్, దేవాలయ భూములపై చిన్న గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని వివరించారు.

ఈ పేద ప్రజలు 300–400 గజాల స్థలాలు కాకుండా కేవలం 60–70 గజాల స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇలాంటి వేలాది కాలనీలు వెలిశాయని, వాటిలో ఏబీవీ పురం కూడా ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ 7 ఎకరాల్లో ప్రజలు నివసిస్తుండగా, మరో 17–18 ఎకరాల్లో 850 మందికి 60 గజాల చొప్పున స్థలాలు కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఈ భూమిపై రాష్ట్ర ప్రభుత్వం ఇది భూదాన్ భూమి అని చెబుతుండగా, ఐడిపిఎల్ సంస్థ తమదని పేర్కొంటున్న నేపథ్యంలో వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై ఇరు పక్షాలు కలిసి చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎంపీ సూచించారు.

స్థానిక ఎంపీగా ఈ సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోర్టు కేసులు నడపడానికి పేదలకు ఆర్థిక శక్తి లేదని, లంచాలు లేకుండా న్యాయబద్ధంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. భూదాన్ భూములు పేదల కోసం మాత్రమే కేటాయించాల్సినవని, వాటిని ఎవరికీ అమ్మే హక్కు లేదని స్పష్టం చేశారు. పేదల సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, కాంతారావు, శ్రీకర్ రావు, పీట్ల మనోహర్ సహా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement