త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Half Day Schools | మార్చి 16 నుంచి ఒంటి పూట బ‌డులు.. పాఠ‌శాల విద్యాశాఖ ఆదేశాలు జారీ

Half Day Schools | ఎండ‌లు ముదురుతున్న నేప‌థ్యంలో మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారుల‌కు డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్ ఆదేశాలు జారీ చేశారు.

S

Telangana | Published On Mar 12, 2026, 6.34 pm IST

Half Day Schools | మార్చి 16 నుంచి ఒంటి పూట బ‌డులు.. పాఠ‌శాల విద్యాశాఖ ఆదేశాలు జారీ
Advertisement

Half Day Schools | త్రినేత్ర‌.న్యూస్ : ఎండ‌లు ముదురుతున్న నేప‌థ్యంలో మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారుల‌కు డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్ ఆదేశాలు జారీ చేశారు.

మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు మ‌ధ్యాహ్నం భోజ‌నం అందించి విద్యార్థుల‌ను ఇంటికి పంపించ‌నున్నారు.

ప‌ది ప‌రీక్షా కేంద్రాల్లో ఒంటిపూట బ‌డుల టైమింగ్స్ ఇలా..

ప‌ది ప‌రీక్షా కేంద్రాల్లో ఒంటిపూట బ‌డుల టైమింగ్స్ కాస్త మారాయి. ఉద‌యం వేళ ప‌ది ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో.. ఆయా పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అయితే వీరికి పాఠ‌శాల‌కు వ‌చ్చిన వెంట‌నే మ‌ధ్యాహ్న భోజ‌నం అందించ‌నున్నారు. ఆ త‌ర్వాత త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. ప‌ది ప‌రీక్ష‌లు పూర్త‌యిన వెంట‌నే వీరికి కూడా ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు.

ఎండాకాలం సెల‌వులు ఎప్ప‌ట్నుంచంటే..?

ఒక‌టి నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఏప్రిల్ మూడో వారం నాటికి వార్షిక ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేయ‌నున్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వ‌ర‌కు ఎండాకాలం సెల‌వుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. జూన్ 12వ తేదీన తిరిగి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయి.

Advertisement
Advertisement