Gutha Sukhender Reddy | రైతుబంధు.. రైతు బోనస్.. రెండిట్లో ఏదో ఒకటి చాలు: గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutha Sukhender Reddy | రైతుబంధు, సన్నాలకు బోనస్ పథకాల్లో ఏదో ఒకటి సంపూర్ణంగా అమలు చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy) ప్రభుత్వానికి సూచించారు. రైతు బంధు సంపూర్ణంగా రాలేదనే అసంతృప్తి అన్నదాతల్లో ఉందని చెప్పారు.
Gutha Sukhender Reddy | త్రినేత్ర.న్యూస్: రైతుబంధు, సన్నాలకు బోనస్ పథకాల్లో ఏదో ఒకటి సంపూర్ణంగా అమలు చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy) ప్రభుత్వానికి సూచించారు. రైతు బంధు సంపూర్ణంగా రాలేదనే అసంతృప్తి అన్నదాతల్లో ఉందని చెప్పారు. రైతు బోనస్, రైతు బంధు ద్వారా ప్రభుత్వానికి ఆర్ధిక భారం ఉన్న విషయం వాస్తవమన్నారు. ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రెండు పథకాల్లో ఏదో ఒక దానిని సంపూర్ణం అమలు చేస్తే బాగుంటుందని చెప్పారు. అందువల్ల రైతు బంధు లేదా రైతు బోనస్‌లలో ఏ పథకం ద్వారా రైతులకు మేలు అవుతుందో దానినే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శంకర్ గౌడ్ మృతి బాధాకరం..
ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం పట్టుదలతో వెళ్లకుండా ప్రజల పక్షాన ఆలోచన చేసి, సమ్మెను విరమించే దిశగా ఆలోచన చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకరయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం లభిస్తుంని చెప్పారు. ఆత్మహత్యల వల్ల కుటుంబాలు నష్టపోతాయన్నారు.
ధాన్యం కొనుగోళ్లు..
రాష్ట్రంలో యసంగి కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ సారి ప్రధానంగా తాలు సమస్య ఇబ్బందిగా మారిందని తెలిపారు. విత్తనాల ద్వారానే తాలు సమస్య వస్తుందని అధికారులు చెప్పారన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే కార్యక్రమాన్ని వేగంగా చేయాలని కోరారు. లేనట్లయితే అకాల వర్షాలతో రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం సాయం చేయట్లే..
మిగతా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనడం లేదని చెప్పారు. అందువల్ల మిగిలిన రాష్ట్రాల రైతులు తెలంగాణకు వచ్చి అక్కడి కన్నా ఎక్కువ ధరకు అమ్ముకొని వెళ్తున్నారని తెలిపారు. ఇది తెలంగాణ రైతాంగానికి నష్టం చేసేలా ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అయినప్పటికీ ఎలాంటి సహాయం అందడం లేదన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తప్పని హితవు పలికారు. ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలి అని చూడవద్దని సూచించారు.
ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలే..
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విషయంలో హైకోర్టు ఎవరికీ క్లిన్ చిట్ ఇవ్వలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వలేదు కాబట్టి హరీశ్ రావు, కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, వారికి అవకాశాలు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. తాను పోటీ చేసే విషయంపై అప్పటి రాజకీయ పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సంబంధిత వార్తలు

RTC Strike | అగ్గిరాజేసిన ఆత్మాహుతి.. మూడో రోజు ఆర్టీసీ సమ్మె ఉధృతం
ఏప్రిల్ 24, 2026

Compensation announcement | శంకర్‌గౌడ్ కుటుంబానికి పరిహారం ప్రకటన.. ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల సాయం
ఏప్రిల్ 24, 2026

Bandi Sanjay | ఆత్మహత్యలొద్దు.. కలిసి కొట్లాడుదాం: ఆర్టీసీ కార్మికులకు బండి సూచన
ఏప్రిల్ 24, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



