Mouth freshner | మౌత్ ఫ్రెషనర్ల పేరుతో గుట్కా విక్రయాలు: ఎంపీ వద్దిరాజు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన "హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీస్ బిల్లు -2025"పై రాజ్యసభలో ఎంపీ రవిచంద్ర సోమవారం సాయంత్రం మాట్లాడారు.
మౌత్ ఫ్రెషనర్ల పేరుతో గుట్కా విక్రయాలు: ఎంపీ వద్దిరాజు
యాలకుల పొడి,మౌత్ ఫ్రెషనర్స్ పేర్లతో పాన్, మసాలా,గుట్కాలు పట్టణాలలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా టీ కొట్లు,పాన్ షాపుల్లో విరివిగా లభిస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వాడకానికి అలవాటైన అల్పాదాయ వర్గాలు సరైన ఆహారం తీసుకోక అనారోగ్యానికి గురవుతున్నారని, తమ పిల్లలను చదివించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ రవిచంద్ర వివరించారు. గుట్కాలు, పాన్ మసాలా, జర్థాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, నోటి,గొంతు కేన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన "హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీస్ బిల్లు -2025"పై రాజ్యసభలో సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. పొగాకు,దాని సంబంధిత ఉత్పత్తులపై పెంచే సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు కూడా వాటా పంచుతామని ఈ బిల్లులో పేర్కొనడం శుభ పరిణామమన్నారు. అలాగే, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని, వీరిలో అత్యధికులు మహిళలు, బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు చెందిన వారని తెలిపారు..
16 శాతం క్యాన్సర్..వీళ్లకే
గుట్కాలు,పాన్ మసాలా,బీడీ పరిశ్రమల్లో పనిచేసే వారిలో చాలా మంది నోటి, గొంతు కేన్సర్ బారినపడి హైదరాబాద్ లోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో చేరుతున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. అందులో చేరే ప్రతి వంద మందిలో 16 మంది నోటి, గొంతు కేన్సర్ తో బాధపడుతున్న వారేనని ఆయన పేర్కొన్నారు.ఇది జాతీయ సగటు కంటే కూడా ఎక్కువ అని, 2030 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని ఎంపీ వద్దిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పొగాకు ఉత్పత్తులపై 75% సుంకాలు విధించాలన్న నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.సెస్ ద్వారా వచ్చే ఆదాయంతో పొగాకు ఉత్పత్తుల వ్యసనాలకు గురైన వారి కోసం డీయాడిక్సన్ కేంద్రాలు మరిన్ని నెలకొల్పాలని, స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ, ఉచితంగా ఆరోగ్య సేవలందించాలని కోరారు .పొగాకు ఉత్పత్తుల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలపై మరింత ప్రచారం అవసరమని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.సెస్ పెంపుదల వల్ల బీడి కార్మికులకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, వారికి ఉపాధి మార్గాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఒక్కొక్కరికి లక్షన్నర రూపాయలు గ్రాంటుగా ఇవ్వాలని సూచించారు.అదేవిధంగా ఆహారశుద్ధి కర్మాగారాల్లో వారికి ఉద్యోగాలివ్వాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలని, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించి ఆదుకోవాలని ఎంపీ రవిచంద్ర సలహానిచ్చారు.ప్రజలు కేన్సర్ బారిన పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా, అనారోగ్యానికి గురైన వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.ఈ బిల్లు ఆమోదం పొందేందుకు తమ పార్టీ బీఆర్ఎస్ మద్దతునిస్తున్నట్లు ఎంపీ వద్దిరాజు చెప్పారు.
సంబంధిత వార్తలు

KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
జులై 28, 2026

Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు
జులై 28, 2026

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
జులై 28, 2026
తాజావార్తలు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
- ●Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
- ●Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల
- ●CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి
- ●Attack with Knife | జనగామలో కత్తిపోట్ల కలకలం.. నలుగురు యువకులపై దాడి
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..

Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల

CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి



