Groundwater | రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. పడిపోతున్న భూగర్భజలాలు
Groundwater | రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడో ముఖం చాటేసిన వరణుడు మళ్లీ పలకరించలేదు. యాసంగి సీజన్ మొదలైంది. వ్యవసాయ పనులకు నీటి వినియోగం ఎక్కువవుతున్నది. దీంతో భూగర్భ జలాలు (Groundwater) అంతకంతకూ పడిపోతున్నాయి.
Groundwater | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడో ముఖం చాటేసిన వరణుడు మళ్లీ పలకరించలేదు. యాసంగి సీజన్ మొదలైంది. వ్యవసాయ పనులకు నీటి వినియోగం ఎక్కువవుతున్నది. దీంతో భూగర్భ జలాలు (Groundwater) అంతకంతకూ పడిపోతున్నాయి. వానలు పూర్తిగా తగ్గిపోవడంతో భూమిలోకి నీరు ఇంకే శాతం కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం (Water Level) నెలకు దాదాపు మీటరు వరకు తగ్గుతున్నది.
గతేడాది డిసెంబర్‌లో 5.30 మీటర్లు ఉండగా, గత నెలలో 6.27 మీటర్లుగా నమోదయ్యింది. ఈ రెండు నెలల మధ్య మట్టాన్ని పోల్చితే 0.97 మీటర్లు పడిపోయింది. అంతకుముందు నవంబర్, డిసెంబర్ నెలల మధ్య పోల్చితే 0.89 మీటర్లు తగ్గింది. అంటే డిసెంబబర్, జనవరి నెలల మధ్య నీటి మట్టం మరింతగా పడిపోయింది. అయితే ఇది సాధారణమైనప్పటికీ వేసవికాలం, వ్యవసాయానికి, గృహ, పరిశ్రమల అవసరాలకు నీటి వినియోగం పెరిగే అవకాశం ఉండంతో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చేది వేసవి కాలం కావడంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ ఏడాది జనవరిలో ఖమ్మం జిల్లాలో నీటిమట్టం ఉపరితల నుంచి 3.50 మీటర్లలో ఉంది. ఇక వికారాబాద్ జిల్లాలో అత్యంత లోతులో 9.82 మీటర్ల వద్ద ఉండటం గమనార్హం. మరో 12 జిల్లాల్లో 5 మీటర్లపైన, 21 జిల్లాల్లో 5-10 మీటర్ల మధ్య ఉన్నది.
డిసెంబరుతో జనవరి నీటి మట్టాలను పోల్చితే అన్ని జిల్లాల్లోనూ నిటిమట్టం పడిపోయింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 2.36 మీటర్లకు పడిపోగా, కామారెడ్డి జిల్లాలో 1.72, మెదక్ 1.57, సిద్దిపేట 1.58, వికారాబాద్ 1.48, సంగారెడ్డి 1.43, మహబూబ్‌నగర్ 1.30 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు చేరుకున్నాయి. కాగా, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 851 మిల్లీమీటర్లుగా నమోదవుతుంది. అయితే గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 1,178 మిల్లీమీటర్లుగా నమోదైంది. అంటే 37 శాతం ఎక్కువ వర్షపాతం రికార్డయింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



