Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు.
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్: పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు డిప్యూటీ సీఎంతోపాటు బే ఏరియాలోని ప్రముఖ ప్రవాస భారతీయులు, ఐటీ, వైద్య, మానవ వనరులు, ఇతర వ్యాపార రంగాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు.
ఐటీ, ఆవిష్కరణల్లో హైదరాబాద్ (Hyderabad) అగ్రగామి టెక్నాలజీ, ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ సర్వీసెస్ రంగాలలో భారతదేశపు ప్రముఖ కేంద్రాలలో ఒకటిగా హైదరాబాద్ ఎదుగుతున్నదని గుర్తుచేశారు. ఈ వృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగిస్తూనే, అభివృద్ధి చెందుతున్న సరికొత్త రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కోసం కొత్త పునాదులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకమైన, పెట్టుబడులకు అనుకూలమైన ప్రగతిశీల అభివృద్ధి నమూనాను అనుసరిస్తోందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ, జవాబుదారీతనం కలిగిన పరిపాలన తెలంగాణ సొంతమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ఆలోచనలను సంస్థలుగా మార్చడంలో, నాణ్యమైన ఉపాధిని సృష్టించడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అడుగులు వేయాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

యువత భవిష్యత్ కోసం..
యువత భవిష్యత్ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skill University) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు కీలక కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి సభకు వివరించారు. చారిత్రక మూసీ నది (Musi Development) పునరుద్ధరణ, సమగ్ర పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తెలంగాణ యువతను భవిష్యత్ ఉద్యోగాలకు, ప్రపంచస్థాయి పోటీకి సన్నద్ధం చేసేందుకు 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'తో పాటు అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
దేశ ప్రగతిలో భాగస్వాములుకండి..
కాన్సుల్ జనరల్ అంతకుముందు సభికులకు స్వాగతం పలికిన కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి.. ప్రవాస భారతీయులు, ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారత దేశంలో సమ్మిళిత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతూనే, ప్రవాసులకు సైతం ప్రయోజనం చేకూర్చేలా బలమైన భాగస్వామ్యాలను అన్వేషించాలని వ్యాపార వర్గాలను కోరారు. అనంతరం పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలు తదితర అంశాలపై ఎన్నారైలు, బే ఏరియా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
సంబంధిత వార్తలు

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
సెప్టెంబర్ 21, 2026

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 21, 2026

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
- ●TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
- ●Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు



