Kodi Mirapa | ‘కోడి మిరప’..! మిరపకాయలందు ఈ మిరప వేరయా..!!
Kodi Mirapa | ప్రతి ఒక్కరు మిరపకాయలను( Green Chilli ) చూసే ఉంటారు. మిరప తోటను కూడా సందర్శించే ఉంటారు. సాధారణంగా మిరపకాయలు చెట్టు కొమ్మలకు కింది భాగంలో వేలాడుతూ ఉంటాయి. కానీ ఈ మిరప కాయ చెట్టు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ మిరప చెట్టుకు మిరపకాయలు పైకి కాస్తున్నాయి.
Kodi Mirapa | ప్రతి ఒక్కరు మిరపకాయలను( Green Chilli ) చూసే ఉంటారు. మిరప తోటను కూడా సందర్శించే ఉంటారు. సాధారణంగా మిరపకాయలు చెట్టు కొమ్మలకు కింది భాగంలో వేలాడుతూ ఉంటాయి. కానీ ఈ మిరప కాయ చెట్టు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ మిరప చెట్టుకు మిరపకాయలు పైకి కాస్తున్నాయి. అంటే కొమ్మకు పై భాగాన నిటారుగా కాస్తున్నాయి. దీంతో ఈ మిరప చెట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మిరప కాయలను కోడి మిరప( Kodi Mirapa ), కొండ మిరప( Konda Mirapa ) అని పిలుస్తారట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradi Kothagudem ) చర్ల మండలం కీకారణ్య ఎర్రంపాడు గ్రామానికి చెందిన ఓ ఆదివాసీ( Adivasi ) తన ఇంటి ఆవరణలో మిరప మొక్కలను సాగు చేస్తున్నాడు. ఈ మిరప చెట్టు సాధారణ మిరప చెట్టుకు భిన్నంగా ఉంది. అంటే అన్ని మిరప చెట్లకు కొమ్మలకు కింది భాగంలో మిరపకాయలు కాస్తే.. ఈ చెట్టుకు మాత్రం కొమ్మకు పై భాగంలో నిటారుగా కాస్తున్నాయి.
తింటే కన్నీళ్లు రావడం ఖాయం..!
ఒకట్రెండు మొక్కలు నాటితే.. ఏడాదికి సరిపోనూ మిరప కాయలు వస్తాయని ఆదివాసీ రైతు పేర్కొన్నారు. ఈ మిరప కాయలు చూడడానికి అతి చిన్నవిగా ఉంటాయి. కానీ కారం బాగానే ఉంటుందని, తింటే కళ్లల్లో నుంచి కన్నీరు రావడం ఖాయమని తెలిపాడు. పూర్వీకుల నుంచి ఈ మిరప మొక్కలు(మూల విత్తనం) పెంచుతూ వస్తున్నామని ఆయన పేర్కొన్నాడు.
కోడి మిరపలో ఔషధ గుణాలు..!
ఈ మిరప కాయలను స్థానికంగా కోడి మిరప లేదా కొండ మిరప అని పిలుస్తారు. ఈ మిరపకాయల్లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని, జన్యుపరమైన కారణంగా అవి పైకి పెరుగుతాయని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఐవీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






