Ponguleti Srinivas Reddy | పేదవాడే ఊపిరిగా ప్రభుత్వ పథకాలు: పెద్దనబెల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనలో పొంగులేటి
Ponguleti Srinivas Reddy | విద్యకు, వైద్యానికి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలంలోని పెద్దనబెల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల (Integrated Residential School) కు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.
- ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
- ప్రతి పేదోడికి విద్య, వైద్యం అందాలి
- ఎంత ధాన్యం పండినా ప్రతి గింజను కొంటం
- వారం రోజుల్లోనూ ఖాతాల్లో డబ్బులు జమ
- కాంగ్రెస్‌పై విషం చిమ్మడమే ప్రతిపక్షాల ఎజెండా
- పెద్దనబెల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: విద్యకు, వైద్యానికి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, పేదవాడే ఊపిరిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలంలోని పెద్దనబెల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల (Integrated Residential School) కు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లడారు.
రూ.200 కోట్లకు తగ్గకుండా..
విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నం. పేదవారికి భరోసా ఇస్తూ, వారికి అండగా ఉంటున్నం. భద్రత కల్పిస్తూ పేదవాడే ఊపిరిగా ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. పేదవాడి విద్యకు, వైద్యానికి ఇబ్బందు కలగొద్దని ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్లు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశాం. దాంతో పాటు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు సాంక్షన్ చేశాం అని మంత్రి తెలిపారు.
ఈ నెలాఖరులోపు రెండో విడత ఇండ్లు..
ఈ గిరిజన ప్రాంతంలో వైద్యానికి కూడా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేసి మెరుగైన వైద్యాన్ని ప్రతి పేదవాడికి అందిస్తున్నం. 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్నబియ్యం, ఇక్కడి ప్రాంతంలో మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. రెండో విడత ఈ నెలాఖరులోపు ఇస్తున్నం. మూడో, నాలుగో విడతలోనూ ఇండ్లు ఇస్తం. హైదరాబాద్‌లో బటన్ నొక్కితే పేదవాడి ఖాతాలో నేరుగా డబ్బులు జమయ్యేలా చూస్తాం అని పొంగులేటి స్పష్టం చేశారు.
దొరల పోకడ ఇంకా మారలే..
అసంపూర్తిగా వదిలేసిన నీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేశాం. స్థానిక ఎమ్మెల్యే చల్లా వెంకట్రావు ఆధ్వర్యంలో అనేక రోడ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 10 ఏండ్ల పాలనలో పేదవాడికి అండగా ఉండాలన్న ఆలోచన వారు చేయలేదు. అదేపనిగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పగటి కలలు కంటున్నారు. ప్రజలు మళ్లీ విశ్వసిస్తారనో, మళ్లీ ఆ దొరలను తెచ్చి నెత్తిన కూర్చోబెట్టుకుంటారనో అనుకుంటున్నారు. ఆ దొరల పోకడ ఇంకా మారలేదు. మీరు చేయని పనులు సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఈరోజు చేసి చూపిస్తున్నం అని చెప్పారు.
ఇంకొకరితో చెప్పించుకోం..
మీరు ఇంటినిండా విషాన్ని నింపుకొని ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ ఎజెండాగా పెట్టుకున్నారు. పేదోడికి అండగా ఉండే జ్ఞానం మీకు లేదు. గత రెండు మూడు రోజులుగా ధాన్యం కొనడం లేదని, మక్కలు కొనడం లేదని వాళ్ల పేపర్లో రాసుకుంటున్నారు. అవన్నీ అబ్బద్దాలే. ఈ ప్రభుత్వం ధాన్యం కొనడమే కాదు వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. రెట్టింపు స్థాయిలో పంటలు పండినా ప్రతి గింజనూ కొంటాం. ప్రతిపక్ష నాయకుల మొసలి కన్నీళ్లను రైతులు ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని కోరుతున్నా. రైతును రాజుగా చేస్తం. ఇంకొకరితో చెప్పిచ్చుకొనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండదు అని మంత్రి పొంగులేటి అన్నారు.
ఏ నిరుపేద కూడా అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని తీసుకురావడానికి ప్రణాళికలు వేసుకున్నారు. వారికి మీ పూర్తి మద్దతు ఉండాలి అని పొంగులేటి కోరారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



