MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
MP Chamala Kirankumar Reddy | గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటీవల అమెరికా, కెనడా పర్యటనలకు వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.
MP Chamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటీవల అమెరికా, కెనడా పర్యటనలకు వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్‌ను నిరాకరించడాన్ని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన దేశానికి ప్రధానిగా ఉన్నా గుజరాత్‌కు ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు చామల మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తుండు..
నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, ఇప్పటికీ ఆయన ఒక రాష్ట్రానికి చెందిన గుజరాత్ ముఖ్యమంత్రిలాగే వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని 'డబుల్ ఇంజన్ సర్కార్' నినాదం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రధాని దేశ నాయకుడిగా వ్యవహరించాలి. గుజరాత్ ఎదగాలి, తెలంగాణ కూడా ఎదగాలి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించుకోవడానికి సమాన అవకాశాలు ఉండాలి.
ఇదిలా ఉండగా ఈ పర్యటనపై సీఎం రేవంత్ నిన్న స్పందించారు. విద్యా, క్రీడా రంగాల్లో ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలను నెలకొల్పడానికి పెట్టుకున్న పర్యటనను కేంద్రం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని ఆరోపించారు. పూర్తి షెడ్యూల్‌ను భారత విదేశాంగ శాఖకు ముందుగానే అందజేశామని, ఈ నిర్ణయం రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదని, 4 కోట్ల తెలంగాణ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
- ●PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. ఒకదానికొకటి ఢీకొట్టిన 6 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్
- ●KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- ●Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Road Accident | వాకింగ్‌కు వెళ్లిన ముగ్గురిని ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు దుర్మరణం
- ●Stock Markets | భారీ లాభాల తర్వాత మార్కెట్లకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో సూచీలు..
- ●Manne Krishank | ఒకటి కాదు.. మూడు ఆధారాలు చూపిస్తం.. చర్చకు సిద్ధమా?: రేవంత్ రెడ్డికి మన్నె క్రిశాంక్ సవాల్

PV Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. ఒకదానికొకటి ఢీకొట్టిన 6 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్

KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్

Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Road Accident | వాకింగ్‌కు వెళ్లిన ముగ్గురిని ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు దుర్మరణం







