Parishad Elections | రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు.. మార్చి మొదటి వారంలో పరిషత్ ఎలక్షన్స్?
Parishad Elections | రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు (Elections) రానున్నాయి. రెండు నెలల క్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం, తాజాగా మున్సిపల్ ఎన్నికలనూ నిర్వహించింది. ఇక మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు (Parishad Elections) సమాయత్తమవుతున్నది.
Parishad Elections | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు (Elections) రానున్నాయి. రెండు నెలల క్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం, తాజాగా మున్సిపల్ ఎన్నికలనూ నిర్వహించింది. ఇక మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు (Parishad Elections) సమాయత్తమవుతున్నది. పురపాలక, కార్పోరేషన్ ఫలితాలను బట్టి వీలైన త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ (Congress) మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ముందస్తు ఫలితాలు వెల్లడించాయి. దీంతో మున్సిపల్ ఫలితాల నుంచి ప్రతిపక్షాలు తేరుకోక ముందే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎన్నికలు జరగకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో పరిషత్ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నది. మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తే బడ్జెట్ సమావేశాలకు ముందే పరిషత్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతు భరోసా డబ్బులు ఇస్తామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసింది. ఇందులో భాగంగా వీలైనంత తర్వగా పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేసి పరిషత్ ఎన్నికలకు వెళ్లనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో మార్చి మొదటివారంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.
ఆరు నెలల తర్వాతే గ్రేటర్ ఎన్నికలు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లు తెలుస్తున్నది. గ్రేటర్‌ని ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. పాలకవర్గం కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారి పాలన కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలు ఆరు నెలల తర్వాతే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఆరు నెలల్లో మూడు కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లనున్నారు..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



