Talasani Srinivas Yadav | ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు అండగా ఉంటాం : తలసాని
Talasani Srinivas Yadav | ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు కార్మికులకు అండగా ఉంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు కార్మికులకు అండగా ఉంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డ్రైవర్ శంకర్ గౌడ్ సంస్మరణ సభలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు రూ. లక్ష ఆర్ధిక సహాయం పంపిణీ చేశారు.
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కోసమే శంకర్ బలిదానం చేసుకున్నాడు. వేలాది మంది ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని శంకర్ గౌడ్ ప్రాణత్యాగం చేశాడు. ఆర్టీసీ కార్మికులలో ఐక్యత లేని కారణంగా ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. శంకర్ గౌడ్ కుమారునికి ఉద్యోగం కల్పించడంలో ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ కేసీఆర్ ప్రభుత్వంలోనే పూర్తయింది. అపాయింటెడ్ డేను ప్రభుత్వం ప్రకటించడమే మిగిలింది. యూనియన్ ఎన్నికలు ముగిశాకే ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం కార్మికులను మోసం చేయడమే అని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





