Khelo India Youth Games 2026 | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. ప్రకటించిన కేంద్రమంత్రి మాండవీయ
Khelo India Youth Games 2026 | ఈ ఏడాది జరుగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ క్రీడా మహోత్సవానికి తెలంగాణ వేదిక కానుండటంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
Khelo India Youth Games 2026 | ఈ ఏడాది జరుగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ క్రీడా మహోత్సవానికి తెలంగాణ వేదిక కానుండటంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రీడా మౌలిక వసతులను వినియోగించుకుంటూ ఈ క్రీడలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది యువ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కడంపై తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది గుర్తింపుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువ క్రీడాకారులకు ప్రోత్సాహం, గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించే చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఈ ప్రయత్నాల ఫలితంగానే ఇంతటి ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్య అవకాశం లభించిందని చెప్పారు. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు రాష్ట్ర ప్రజల తరఫున శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్రీడల నిర్వహణతో దేశంలోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు తెలంగాణకు రానున్నారని, రాష్ట్ర ఆతిథ్య సామర్థ్యాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. క్రీడా రంగంలో తెలంగాణకు ఉన్న అవకాశాలను మరింత విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల నిర్వహణ ద్వారా రాష్ట్రంలో క్రీడా సంస్కృతి మరింత బలోపేతం అవుతుందని, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని వాకిటి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల క్రీడాకారులకు ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





