Conductor Posts | రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి.. 1,500 కండక్టర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!
Conductor Posts | ఆర్టీసీ (TGS RTC) మరో నియామక ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే 3 వేలకుపైగా డ్రైవర్, శ్రామిక్ పోస్టులను భరీ చేస్తున్నది. తాజాగా 1500 కండక్టర్ పోస్టుల (Conductor Posts) భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
Conductor Posts | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ (TGS RTC) మరో నియామక ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే 3 వేలకుపైగా డ్రైవర్, శ్రామిక్ పోస్టులను భరీ చేస్తున్నది. తాజాగా 1500 కండక్టర్ పోస్టుల (Conductor Posts) భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నియామకాలను ఆర్టీసీ యాజమాన్యమే చేపట్టనుంది. పదో తరగతి (SSC Marks) మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగుల్ని ఎంపిక చేయనుంది. దీంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఏటా ఉన్న ఉద్యోగులే రిటైరవుతుండటంతో ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు కొంతకాలం క్రితం ఔట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ రీజియన్ల పరిధిలోని డిపోల్లో కండక్టర్లను నియమించింది. ఇప్పుడు ప్రభుత్వం అనుమతించడంతో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి రెడీ (Conductor Recruitment) అవుతున్నది.
అయితే నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఆర్టీసీ ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సిన అవసరం వచ్చింది. సాధారణంగా కండక్టర్ ఉద్యోగాలను పదో తరగతి మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే పదోతరగతి మార్కులకు గతంలో జీపీఏ గ్రేడింగ్ విధానం ఉండేది. ప్రస్తుతం మార్కుల విధానం అమల్లోకి వచ్చింది. దీంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండింటినీ సమానంగా ఎలా అంచనా వేయాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడింగ్ పాయింట్లను మార్కుల శాతంలోకి ఎలా మార్చాలనే దానిపై క్లారిటీ ఇవ్వాలని ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాశారు. బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
సంబంధిత వార్తలు

Mee Seva | మీ-సేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్.. ఎంత చెల్లించాలంటే?
జులై 9, 2026

Khelo India Youth Games 2026 | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. ప్రకటించిన కేంద్రమంత్రి మాండవీయ
జులై 8, 2026

Talasani Srinivas Yadav | ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు అండగా ఉంటాం : తలసాని
జులై 8, 2026
తాజావార్తలు
- ●Mee Seva | మీ-సేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్.. ఎంత చెల్లించాలంటే?
- ●HPCL | హెచ్పీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. డిప్లొమా, డిగ్రీ అర్హత
- ●Horoscope | జూలై 9 రాశి ఫలాలు.. ఈ రాశివారికి అనవసరమైన ఆందోళనలు ఉండవచ్చు!
- ●Pune Siya Goyal Case | భర్త, బెస్ట్ ఫ్రెండ్ మాస్టర్ స్కెచ్.. పావుగా మారిన సియా! ఈ క్రైమ్ స్టోరీ చదివితే మైండ్ బ్లాంకే..!
- ●OU PhD Admissions | ఓయూ పీహెచ్డీ క్యాటగిరీ-1 ఫలితాలు వచ్చేశాయ్.. తదుపరి ప్రక్రియ ఇదే!
- ●AP CM Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు తెలంగాణ లారీ ఓనర్ల లేఖ.. ఆ నిర్ణయంతో ఏపీ ఖజానాకు అదనపు ఆదాయం

Mee Seva | మీ-సేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్.. ఎంత చెల్లించాలంటే?

HPCL | హెచ్పీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. డిప్లొమా, డిగ్రీ అర్హత

Horoscope | జూలై 9 రాశి ఫలాలు.. ఈ రాశివారికి అనవసరమైన ఆందోళనలు ఉండవచ్చు!

Pune Siya Goyal Case | భర్త, బెస్ట్ ఫ్రెండ్ మాస్టర్ స్కెచ్.. పావుగా మారిన సియా! ఈ క్రైమ్ స్టోరీ చదివితే మైండ్ బ్లాంకే..!



