Petrol Bunks | ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?.. పౌరసరఫరాల శాఖ ఏమందంటే..?
Petrol Bunks | ఇంధనం ఆదాచేయాలని, అనవసర వ్యయాన్ని తగ్గించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) గత ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం (Sunday Closure) పెట్రోల్ బంకులు (Petrol Bunks) మూసివేయనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతున్నది.
Petrol Bunks | త్రినేత్ర.న్యూస్: ఇంధనం ఆదాచేయాలని, అనవసర వ్యయాన్ని తగ్గించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) గత ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం (Sunday Closure) పెట్రోల్ బంకులు (Petrol Bunks) మూసివేయనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతున్నది. ఆ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది. “NO FUEL ON SUNDAY” అనే పదాలతో పాటు ప్రధాని మోదీ ఫొటోను ఉపయోగించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయాలని పెట్రోలియం డీలర్ల ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుందని అందులో పేర్కొన్నారు.
అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అది పూర్తిగా తప్పుడు సమాచారమని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ సంస్థ స్పష్టం చేసింది. ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయనున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని వెల్లడించింది. ఏపీ సర్కార్ కూడా ఈ వార్తను ఖండించింది. అదంతా వట్టిదేనని కొట్టిపారేసింది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. అది అసత్య ప్రచారం అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడవని, ఎప్పటిలానే సాధారణంగానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని, అది ఫేక్ న్యూస్ (Fake News ) అని స్పష్టం చేసింది. తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడవు. ప్రతీరోజు లానే ఆదివారం కూడా తెరిచే ఉంటాయని తెలిపింది. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేసిది. ఎవైనా సందేహాలు ఉంటే 1967 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించింది.

సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



