త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gadwal Vijayalakshmi | పర్యావరణహితంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: గద్వాల్ విజయలక్ష్మి

Gadwal Vijayalakshmi | ప‌ర్యావ‌ర‌ణహితంగా మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను పూజించాల‌ని రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్‌ప‌ర్స‌న్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి (Gadwal Vijayalakshmi) అన్నారు. గ‌ణేశ్ చ‌తుర్ది (Ganesh Chaturthi) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

G

Telangana | Published On Sep 14, 2026, 6.55 am IST

Gadwal Vijayalakshmi | పర్యావరణహితంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: గద్వాల్ విజయలక్ష్మి
Advertisement

Gadwal Vijayalakshmi | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌ర్యావ‌ర‌ణహితంగా మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను పూజించాల‌ని రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్‌ప‌ర్స‌న్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి (Gadwal Vijayalakshmi) అన్నారు. గ‌ణేశ్ చ‌తుర్ది (Ganesh Chaturthi) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు.

వినాయక చవితిని (Vinayaka Chavithi) ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పండుగను పర్యావరణహితంగా నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గణేశ్‌ మండపాల వద్ద భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐకమత్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement