త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Governor | ‘ప‌ది’ విద్యార్థుల‌కు ఆల్ ది బెస్ట్.. మంచి ఫ‌లితాలు సాధించాల‌న్న గ‌వ‌ర్న‌ర్

Governor | రాష్ట్ర వ్యాప్తంగా రేప‌ట్నుంచి ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌రవుతున్న విద్యార్థుల‌కు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

S

Telangana | Published On Mar 13, 2026, 2.03 pm IST

Governor | ‘ప‌ది’ విద్యార్థుల‌కు ఆల్ ది బెస్ట్.. మంచి ఫ‌లితాలు సాధించాల‌న్న గ‌వ‌ర్న‌ర్
Advertisement

Governor |  త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా రేప‌ట్నుంచి ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌రవుతున్న విద్యార్థుల‌కు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement