Governor Shiv Pratap Shukla | భారతీయ సంస్కృతిలో విశిష్టమైనది రామాయణం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Governor Shiv Pratap Shukla | భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైనదని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) తెలిపారు. శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ తల్లి పవిత్రతకు ప్రతీక అని చెప్పారు.
Governor Shiv Pratap Shukla | త్రినేత్ర.న్యూస్: భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైనదని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) తెలిపారు. శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ తల్లి పవిత్రతకు ప్రతీక అని చెప్పారు. రామాయణంలో ఆదర్శ పుత్రుడు, భర్త, పురుషుడిగా నిలబడిన శ్రీరాముడిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ ఆలయం వద్ద శ్రీరామ శోభయాత్రను గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి నగరంలో శ్రీరామ శోభాయాత్ర, కల్యాణోత్సవం విశేషంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. శోభాయాత్ర భక్తుల ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. ఇందులో పాల్గొనే భక్తుల ఆధ్యాత్మికత ఉత్సాహం.. నగర వాతావరణాన్ని ఆధ్యాత్మిక భావనలో నిలుపుతుందన్నారు.
శోభాయాత్ర వేళ.. వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయవద్దని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. దాదాపు 3 వేల మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశామన్నారు. పిక్ పాకెటర్స్‌పై నిఘా కోసం క్రైమ్ టీమ్‌లు ఏర్పాటు చేశామని, షీ టీంలు కూడా శోభాయాత్ర వెంట ఉంటాయని వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





