City Civil Court | ఆ మొబైల్స్ కొనుగోళ్లలో అవినీతి లేదు.. బీఆర్ఎస్ పార్టీకి కోర్టు మొట్టికాయ
City Civil Court | రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్లకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల ధరల విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. తక్కువ ధరకు వచ్చే మొబైల్స్‌ను అధిక ధరకు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ.. తమ పార్టీ సోషల్ మీడియాలో ఖాతాలో పోస్టులు చేసింది.
City Civil Court | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్లకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల ధరల విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. తక్కువ ధరకు వచ్చే మొబైల్స్‌ను అధిక ధరకు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ.. తమ పార్టీ సోషల్ మీడియాలో ఖాతాలో పోస్టులు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మీద సంబంధిత శాఖ మంత్రి సీతక్క పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తక్షణమే సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశించింది.
అంగన్వాడీ మొబైల్ ఫోన్ కొనుగోళ్ల మీద, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంగా నిర్దారిస్తూ, తక్షణమే బీఆర్ఎస్ అకౌంట్ల నుంచి పోస్టులను తొలగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ డాక్యుమెంట్స్ పరిశీలించిన కోర్టు, రూ. 30 కోట్లు అవినీతి అనే బీఆర్ఎస్ ఆరోపణల్లో ఏలాంటి వాస్తవం లేదని తేల్చింది. టెండర్ నోటిఫికేషన్ నుండి చెక్ పేమెంట్ వరకు వివరాలను కోర్టు పరిశీలించింది. మొబైల్ ఫోన్లు ఒకటి రూ. 11,650తో మొత్తం రూ. 44,42,14,500 కొనుగోలు చేయగా.., రూ. 8499 విలువైన ఫోన్ రూ. 14,499 కొన్నారు అని బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా కోర్టు నిర్ధారించింది. సదరు ఆరోపణలు పిటిషినర్ సీతక్క ప్రతిష్ఠను దెబ్బతీయడానికే అన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. తప్పుడు ఆరోపణలతో కూడిన సోషల్ మీడియా పోస్టులను తక్షణం తొలగించాలని.. బీఆర్ఎస్, కేసీఆర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఫేస్ బుక్, ట్విట్లర్, ఇన్‌స్టాగ్రామ్ నుండి ఏప్రిల్ 10న చేసిన పోస్టులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సీతక్క తరపున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ వాదనలు వినిపించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



