Gajwel MRO | నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!
Gajwel MRO | రైతు( Farmer ) సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వ అధికారే అవహేళనగా మాట్లాడారు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా... పురుగుల మందు తాగలేదా.. అని గజ్వేల్ ఎమ్మార్వో( Gajwel MRO ) సదరు రైతును అవమానించారు.
Gajwel MRO | త్రినేత్ర న్యూస్ : రైతు( Farmer ) సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వ అధికారే అవహేళనగా మాట్లాడారు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా... పురుగుల మందు తాగలేదా.. అని గజ్వేల్ ఎమ్మార్వో( Gajwel MRO ) సదరు రైతును అవమానించారు.
భూ సమస్య వల్ల ఒక రైతు గత కొంతకాలం నుంచి గజ్వేల్ ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఎమ్మార్వో కూడా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ ఇటీవల బాధిత రైతు ఎమ్మార్వో ఆఫీసు మెట్లెక్కాడు.
ఇక ఎమ్మార్వో కార్యాలయంలో పలువురు కూర్చుని మాట్లాడుతుండగా, సదరు రైతు నిలబడి తమ సమస్యను ఎమ్మార్వోకు విన్నవించబోయాడు. ఎమ్మార్వో వెంటనే స్పందిస్తూ.. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..? అని అవహేళన చేశారు. అంతేకాదు వెకిలిగా నవ్వారు. నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని ఎమ్మార్వో సమాధానం చెబుతూ పగలబడి నవ్వారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
“నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా?” 😡
సమస్య చెప్పుకోవడానికి వచ్చిన రైతుతో అవహేళనగా మాట్లాడిన గజ్వేల్ ఎమ్మార్వో
కాంగ్రెస్ అధికార మదం, అహంకార పాలనకు ఇదే నిదర్శనం! https://t.co/bBBJlsiFHR
— BRS Party (@BRSparty) October 10, 2026
తాజావార్తలు
- ●Abhijeet Dipke | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం
- ●ED Petition in HC | జగన్ అక్రమాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిషన్
- ●PV Kiran | కర్నూల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి
- ●Bhatti Vikramarka | గట్టిగ పని చేద్దాం.. సర్వోత్తమ్రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దాం
- ●Nani | గ్యాంగ్స్టర్గా నాని - మలయాళ బ్యూటీతో రొమాన్స్ - బ్రేక్ లేకుండా షూటింగ్
- ●RBI | ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు కొత్త సీఆర్ఆర్ నిబంధన..

Abhijeet Dipke | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం

ED Petition in HC | జగన్ అక్రమాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిషన్

PV Kiran | కర్నూల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి

Bhatti Vikramarka | గట్టిగ పని చేద్దాం.. సర్వోత్తమ్రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దాం





