త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఇందిర‌మ్మ రాజ్యంలో ఇంటింటా మోసం: కేటీఆర్‌

KTR | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) అన్నారు. అధికార పార్టీ మోసాల‌ను అసెంబ్లీలో నిల‌దీస్తామ‌ని చెప్పారు.

G

Telangana | Published On Sep 7, 2026, 9.54 am IST

KTR | ఇందిర‌మ్మ రాజ్యంలో ఇంటింటా మోసం: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) అన్నారు. అధికార పార్టీ మోసాల‌ను అసెంబ్లీలో నిల‌దీస్తామ‌ని చెప్పారు. హామీల అమలుపై పోరాటం చేయాలని మా నాయకుడు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారని వెల్ల‌డించారు. అసెంబ్లీ స‌మావేశాల (Assembly Monsoon Session) నేప‌థ్యంలో గ‌న్‌పార్క్‌లోని అమ‌ర‌వీరుల‌ స్థూపం వ‌ద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి, గద్దెనెక్కి 1000 రోజులైనా వాటిని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) వ్యతిరేకంగా నిరసన తెలిపారు. `హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం.. 1000 రోజుల పాలన నిష్ఫలం` అని రాసిఉన్న నల్ల టీ-షర్టుల‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధ‌రించారు. ఇందిర‌మ్మ రాజ్యంలో ఇంటింటా మోసం, కాంగ్రెస్ 1000 రోజుల పాల‌న అంతా ఎగ‌వేతల ఏలికా!.. రేవంత్ నీ పాల‌న చాలిక‌, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాల‌న అంతా ఎగ‌వేత‌లు, కూల్చివేత‌లు, అణ‌చివేత‌లు అని ఉన్న ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు.

అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ.. 100 రోజుల్లోనే ఇస్తామన్న రూ.15000 రైతు భరోసా ఏమైందని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిరుద్యోగులకు రూ.82000 బాకీ పడింద‌ని చెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌ (Job Calendar) ఏమైందని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. రియల్‌ ఎస్టేట్‌ కోసం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టిందని విమ‌ర్శించారు. సింగరేణిలో దోపిడీపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామ‌ని చెప్పారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను నెలరోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement