త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్

బ్యాంకు ఖాతాలో రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసి ఐటీఆర్ దాఖలు చేయని రిటైర్డ్ ఉపాధ్యాయుడికి ఊరట లభించింది. ఐటీఏటీ బెంగళూరు బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.

J

National | Published On Sep 22, 2026, 6.08 pm IST

Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్

సంక్షిప్త సారాంశం

కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన రిటైర్డ్ స్కూల్ ఉపాధ్యాయుడు తన బ్యాంకు ఖాతాల్లో రూ. 1.33 కోట్లు నగదు డిపాజిట్ చేసి ఐటీఆర్ (ITR) దాఖలు చేయలేదు. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2015-16 కోసం సెక్షన్ 148 కింద ఆదాయపు పన్ను శాఖ రీఅసెస్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. అయితే, గడువు ముగిసిన తర్వాత 26 రోజులు ఆలస్యంగా నోటీస్ జారీ కావడాన్ని ఐటీఏటీ (ITAT) బెంగళూరు బెంచ్ తప్పుబట్టింది. పరిమితి కాలం ముగిసిన తర్వాత జారీ చేసిన నోటీస్ చెల్లదని స్పష్టం చేస్తూ, ఐటీ శాఖ ఉత్తర్వులను కొట్టివేసి ట్యాక్స్ పేపర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

Advertisement

Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | త్రినేత్ర న్యూస్ : కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన ఓ రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడికి ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) నుంచి ఊరట లభించింది. తన బ్యాంకు ఖాతాల్లో రూ.1.33 కోట్ల నగదు డిపాజిట్లు చేసి.. ఎటువంటి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయని ఈ సీనియర్ సిటిజన్‌కు ఐటీ శాఖ నుంచి రీఅసెస్‌మెంట్ నోటీసులు అందాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యూహం కింద ఈ లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.

అసలు ఏం జరిగిందంటే?

ఆదాయపు పన్ను శాఖ పరిశీలన ప్రకారం.. అసెస్ మెంట్ ఇయర్ 2015-16 కోసం ఆ వ్యక్తి ఎటువంటి ఐటీఆర్ దాఖలు చేయలేదు . అతని ప్రధాన ఆదాయ వనరులు వ్యవసాయం, సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ అని స్పష్టమైనప్పటికీ, వాస్తవ ఆదాయ వివరాలు శాఖ వద్ద లేవు. దీనితో సెక్షన్ 148A(b) కింద మొదటి నోటీసు జారీ చేయగా, ఆయన స్పందించలేదు . ఆ తర్వాత ఏవో (Assessing Officer) సెక్షన్ 148 కింద రీఅసెస్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించి నోటీసు జారీ చేశారు.

దీనిపై వివిధ దశల విచారణల అనంతరం.. రూ. 48.85 లక్షల ఆదాయాన్ని నిర్ధారిస్తూ ట్యాక్స్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ అప్పీల్ (CIT (A)) పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆ వ్యక్తి ఐటీఏటీ బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించారు.

ఐటీఏటీ బెంగళూరు బెంచ్ కీలక తీర్పు

ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన ఐటీఏటీ బెంచ్.. నగదు మొత్తం ఎంతనేది కాకుండా, నోటీసు జారీ చేసిన సమయం ఆధారంగా కీలక నిర్ణయం తీసుకుంది. అసెస్‌మెంట్ ఇయర్ 2015-16 కోసం రీఅసెస్‌మెంట్ నోటీసు జారీ చేయడానికి మార్చి 31, 2022 చివరి గడువు కాగా.. సెక్షన్ 148 కింద ఏప్రిల్ 26, 2022న అనగా గడువు ముగిసిన 26 రోజుల తర్వాత నోటీసు జారీ చేసినట్లు ట్రిబ్యునల్ గుర్తించింది.

నిర్ణీత పరిమితి కాలం (Limitation period) ముగిసిన తర్వాత జారీ చేసిన నోటీసు చట్టవిరుద్ధమని, అది చెల్లదని ఐటీఏటీ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన గత తీర్పుల ఆధారంగా.. గడువు దాటిన తర్వాత ఇచ్చిన సెక్షన్ 148 నోటీసును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఐటీ శాఖ జారీ చేసిన రీఅసెస్‌మెంట్ ఉత్తర్వులు రద్దయ్యాయి.

Advertisement
Advertisement