Telangana | ఉచితంగా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
Telangana | రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి 20 ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు ఉచితంగా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు ఆస్ట్రాజెనెకా సంస్థతో ఆరోగ్యశాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఏప్రిల్ 6 నుంచి 11 వరకు హెల్త్ అవేర్‌నెస్ వీక్
వారం రోజుల్లో 20 కార్యక్రమాలతో అదరగొట్టిన ఆరోగ్యశాఖ
ప్రతీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ
Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి 20 ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు ఉచితంగా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు ఆస్ట్రాజెనెకా సంస్థతో ఆరోగ్యశాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11వ తేదీ వరకూ హెల్త్ అవేర్‌నెస్ వీక్‌ను ప్రభుత్వం నిర్వహించింది. వారం రోజుల్లో 20 కార్యక్రమాలతో ఆరోగ్య శాఖ అదరగొట్టింది. ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని ప్రజలకు ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతతో పాటు ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు.
హెల్త్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపేలా ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ సేఫ్టీ అవేర్‌నెస్ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సెడెంటరీ లైఫ్ స్టైల్‌ను వీడి, ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోవాలని చెప్పేలా యోగా సెషన్స్, ఆటల పోటీలు నిర్వహించారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు.
డీ–అడిక్షన్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభం..
మత్తు బానిసలకు చికిత్స అందించేందుకు మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌లో డీ–అడిక్షన్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా మరో 35 సెంటర్ల ఏర్పాటు చేశారు. క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు నిమ్స్‌లో లైనాక్ సేవలు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎమర్జన్సీల్లో బాధితుల ప్రాణాలు కాపాడుకునేలా ట్రామాకేర్ పాలసీని లాంచ్ చేశారు. కొండాపూర్‌లో వంద బెడ్ల క్రిటికల్ కేర్ భవనానికి పునాది వేయగా, నాగర్‌కర్నూల్‌లో 50 బెడ్ల క్రిటికల్ కేర్ భవనాన్ని ప్రారంభించారు.
నోటిఫైబుల్ డిసీజ్‌గా క్యాన్సర్
మహిళల్లో క్యాన్సర్ వ్యాధిని తొలినాళ్లలోనే గుర్తించే వుమెన్ హెల్త్ కేన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల ఏర్పాటుతో పాటు క్యాన్సర్‌ను నోటిఫైబుల్ డిసీజ్‌గా ప్రకటించారు. క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రారంభించారు. హెచ్‌ఐవీ, ఇతర సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్‌లపై అవగాహన కల్పిస్తూ కేబుల్ బ్రిడ్జ్‌పై మానవహారం నిర్వహించారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించింది. ఖైదీల ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని జైళ్లలో హెల్త్ క్యాంపుల నిర్వాహణ.. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాంపులు నిర్వహించేలా ఆరోగ్యశాఖ, జైళ్ల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆరోగ్యశాఖలో రెండేళ్లలో 12,649 ఉద్యోగాల భర్తీ
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో ఖాళీల భర్తీపై దృష్టి సారించిన ప్రభుత్వం.. 866 మంది డాక్టర్లకు నియామక పత్రాలు అందజేసింది. 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఆరోగ్యశాఖలో రెండేళ్లలో 12,649 ఉద్యోగాల భర్తీ పూర్తయింది.
మిడ్ వైఫరీ ట్రైనింగ్ కోర్సు
కోఠిలో డాక్టర్స్ భవన్‌ను ప్రారంభించి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, నార్మల్ డెలివరీల సంఖ్య పెరిగేలా అవగాహన కార్యక్రమాలు.. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్ వైఫరీ ట్రైనింగ్ కోర్సును ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించారు. హాస్పిటళ్లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర సంస్థలకు సంబంధించిన దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియను సులభతరం చేసే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పోర్టల్ ప్రారంభించారు. ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసికి సంబంధించిన దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పీసీపీఎన్‌డీటీ, సరోగసి పోర్టల్స్ ప్రారంభించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Google Gemini 4 Argon | గూగుల్ నుంచి జెమిని 4 ఆర్గాన్.. సంక్లిష్ట పనుల్లో సరికొత్త ఏఐ మోడల్..
- ●Asaduddin Owaisi | SIRపై సుప్రీంకోర్టుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ..
- ●Bank of Baroda | భారీగా పతనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు.. కారణం ఇదే..
- ●Air India Flight | హైజాక్ పుకార్లు.. ఫ్రాంక్ఫర్ట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం దారిమళ్లింపు
- ●TG SAFE | కిచెన్‌లో అపరిశుభ్రత.. 4 హోటళ్ల లైసెన్సులు రద్దుచేసిన టీజీ సేఫ్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..

Google Gemini 4 Argon | గూగుల్ నుంచి జెమిని 4 ఆర్గాన్.. సంక్లిష్ట పనుల్లో సరికొత్త ఏఐ మోడల్..

Asaduddin Owaisi | SIRపై సుప్రీంకోర్టుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ..

Bank of Baroda | భారీగా పతనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు.. కారణం ఇదే..

Air India Flight | హైజాక్ పుకార్లు.. ఫ్రాంక్ఫర్ట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం దారిమళ్లింపు






