త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maddirala Rocireddy Arrest | బోగ‌స్ ప‌త్రాలతో ఘ‌రానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్

Maddirala Rocireddy Arrest | బోగ‌స్ ప‌త్రాల‌తో ప్లాట్ల విక్రాయాల‌కు పాల్ప‌డుతున్న ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

S

Telangana | Published On Oct 5, 2026, 1.47 pm IST

Maddirala Rocireddy Arrest | బోగ‌స్ ప‌త్రాలతో ఘ‌రానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
Advertisement

Maddirala Rocireddy Arrest | త్రినేత్ర న్యూస్: బోగ‌స్ ప‌త్రాల‌తో ప్లాట్ల విక్రాయాల‌కు పాల్ప‌డుతున్న ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో పలువురికి బురిడీ కొట్టించి త‌ప్పించుకు తిరుగుతున్నాడ‌ని పేర్కొన్నారు. జడ్చర్లలో ప్లాట్ పేరుతో ఓ బాధితుడి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకున్నట్లు తెలిపారు. స‌ద‌రు ప్లాట్‌పై ఆరా తీస్తే ఆ స్థలంపై హక్కులే లేవని నిర్ధారించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

రోసిరెడ్డిపై సీసీఎస్, జూబ్లీహిల్స్ సహా పలు పీఎస్‌లలో గతంలోనూ చీటింగ్ కేసులు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. రోసిరెడ్డి బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించిన‌ట్లు చెప్పారు. బాధితులను తప్పుదోవ పట్టించేందుకు, గతంలో 'ఫార్చ్యూన్ 99 హోమ్స్' పేరిట చేసిన మోసాల నుంచి తప్పించుకునేందుకు ఈ సంస్థ పేరును 'లావురా డెవలపర్స్' (Lavoura Developers) గా మార్చినట్లు కూడా వార్తా సంస్థలు వెల్లడించాయి.రోసిరెడ్డి మోసాలపై లోతైన ద‌ర్యాప్తు అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసుల స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో రంగారెడ్డి జిల్లా ముత్యాల గ్రామంలోని అన్‌రిజిస్టర్డ్ 'అంబర్ హోమ్స్' ప్రాజెక్ట్‌లో ప్లాట్ కొనుగోలుదారులను మోసం చేసినందుకు TG RERA రోసిరెడ్డిని తప్పుపట్టింది. ఆయనను డిఫాల్టర్‌గా ప్రకటించి, అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పేరును ప్రదర్శించాలని ఆదేశించింది.

Advertisement
Advertisement