త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగ‌స్టు 25న జాబ్‌మేళా

Job Mela | ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో (UEIGB-MCC), మెడ్‌ప్లస్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్‌ బ్యూరో UEIGB-MCC కార్యాలయంలో కార్యక్రమం జ‌రుగ‌నున్న‌ది.

P

Hyderabad | Published On Aug 19, 2026, 7.46 pm IST

Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగ‌స్టు 25న జాబ్‌మేళా
Advertisement

Job Mela | ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో (UEIGB-MCC), మెడ్‌ప్లస్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్‌ బ్యూరో UEIGB-MCC కార్యాలయంలో కార్యక్రమం జ‌రుగ‌నున్న‌ది. మెడ్‌ప్లస్‌ గ్రూప్‌లో ఫార్మసిస్ట్, అసిస్టెంట్‌ పోస్టులు కలిపి మొత్తం 100 ఖాళీలను ఈ జాబ్‌మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీతో పాటు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతీ యువకులు హాజరుకావచ్చని యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ గైడెన్స్‌ బ్యూరో (UEIGB/MCC) చీఫ్ టీ రాము తెలిపారు. ఎంపికైన ఫార్మసిస్ట్‌లకు నెలకు రూ.25 వేల వరకు, అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌లకు రూ.16వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌ ప్రతులతో ఈ నెల 25న నేరుగా ఎంప్లాయిమెంట్‌ బ్యూరోకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు మెడ్‌ప్లస్‌ హెచ్‌ఆర్‌ ప్రతినిధి శ్రీ సాయి శైలేష్‌ను 9666662481 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement